New Guidelines: న్యూ ఇయర్ వేడుకలపై నిషేధం..కేంద్ర కొత్త మార్గదర్శకాలు
New Guidelines: కరోనా కొత్త స్ట్రెయిన్..శీతాకాలం నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం కొత్త ఆదేశాలు జారీ చేసింది. దేశవ్యాప్తంగా మూడ్రోజుల పాటు ఆంక్షలు అమలు చేయాలని సూచించింది.
New Guidelines: కరోనా కొత్త స్ట్రెయిన్..శీతాకాలం నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం కొత్త ఆదేశాలు జారీ చేసింది. దేశవ్యాప్తంగా మూడ్రోజుల పాటు ఆంక్షలు అమలు చేయాలని సూచించింది.
వుహాన్ లో కరోనా వైరస్ ( Corona virus ) ప్రారంభమైన సరిగ్గా ఏడాదికి బ్రిటన్ ( Britain ) లో కరోనా కొత్త రూపు దాల్చి విస్తరించడం ప్రారంభమైంది. బ్రిటన్ కరోనా స్ట్రెయిన్ ( Britain corona strain ) గా పిలుస్తున్న ఈ వైరస్ సంక్రమణ రేటు ఎక్కువ కావడంతో ఆందోళన కలుగుతోంది. ఇప్పటికే యూకే ( UK ) నుంచి ఇండియాకు రిటర్న్ అయినవారిలో 8 మందికి కొత్త కరోనా స్ట్రెయిన్ ( New coronavirus strain ) సోకినట్టు నిర్ధారణైంది. ఈ నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది.
నూతన సంవత్సర వేడుకల్లో కరోనా సంక్రమణ ప్రమాదాన్నిదృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం కొత్తగా మార్గదర్శకాలు ( New guidelines ) జారీ చేసింది. న్యూ ఇయర్ వేడుకల్ని ( New year celebrations ) నియంత్రించే దిశగా ఆంక్షలు కఠినంగా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. డిసెంబర్ 30, 31, జనవరి 1 మూడ్రోజుల పాటు ఆంక్షల్ని కఠినంగా అమలు చేయనుంది. స్థానిక పరిస్థితుల్ని అంచనా వేసి..మూడ్రోజులపాటు జనం గుమిగూడే ఈవెంట్లు, సామూహిక కార్యక్రమాల్ని రద్దు చేయాలని సూచించింది. హోటళ్లు, పబ్ లు, రెస్టారెంట్లు, ఓపెన్ ప్లేసెస్ లో న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు విధించింది. అమలు చేసే బాథ్యత రాష్ట్ర ప్రభుత్వాలదేనని స్పష్టం చేసింది.
Also read: Sasikala: తమిళ చిన్నమ్మ విడుదల ఎప్పుడు..ప్రారంభమైన స్వాగత ఏర్పాట్లు