Jobs Alert: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్, కేంద్రీయ విద్యాలయాల్లో భారీగా రిక్రూట్మెంట్
Jobs Alert: నిరుద్యోగులకు శుభవార్త. కేంద్రీయ విద్యాలయాల్లో భారీగా ఉద్యోగాల భర్తీ జరగనుంది. వివిధ విభాగాల్లో మొత్తం 13 వేల 404 ఉద్యోగాలున్నాయి. ఎంపిక, పరీక్ష ఇతర వివరాలు ఇలా ఉన్నాయి.
దేశవ్యాప్తంగా ఉన్న వివిధ కేంద్రీయ విద్యాలయాల్లో పెద్దఎత్తున ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. దేశంలో ఎక్కడైనా ఉద్యోగం చేసేందుకు ఆసక్తిగా ఉంటే ఆకర్షణీయమైన జీతాలు అందుకోవచ్చు.
దేశంలోని కేంద్రీయ విద్యా సంస్థల్లో పీఆర్టీ, టీజీటీ, పీజీటీ, వైస్ ప్రిన్సిపల్, ప్రిన్సిపల్, మ్యూజిక్ టీచర్, లైబ్రేరియన్ వంటి 13,404 పోస్టులు భర్తీ కానున్నాయి. పోస్టును బట్టి ఉండే పరీక్ష, డెమో, ఇంటర్వ్యూ, స్కిల్ టెస్టుల్లో ప్రతిభ ఆధారంగా నియామకాలుంటాయి. పరీక్ష ఆన్‌లైన్ విధానంలో జరుగుతుంది. ఉపాధ్యాయ పోస్టుకు డెమో, ఇంటర్వ్యూ తప్పనిసరి.
ప్రైమరీ టీచర్‌కు 55 వేల కంటే ఎక్కువే జీతం ఉంటుంది. ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ అయితే 75 వేలు దాటి ఉంటుంది. పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ అయితే 85 వేల వరకూ వేతనం ఉంటుంది. కొంతకాలం ఇతర రాష్ట్రాల్లో ఉద్యోగం అనంతరం సొంతరాష్ట్రంలో చేసేందుకు వీలుంటుంది. డీఎడ్ బీఎడ్ పూర్తిచేసినవారు సైతం ఉద్యోగాలకు ప్రయత్నించవచ్చు. పీఆర్టీ, టీజీటీ పోస్టులకు సీటెట్ అర్హత తప్పనిసరి. హిందీ భాషకు సంబంధించి పది ప్రశ్నలు కచ్చితంగా ఉంటాయి.
ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులు స్వీకరిస్తారు. డిసెంబర్ 26 ఆఖరు తేదీ. ఏపీలో అనంతపురం, గుంటూరు, కాకినాడ, కర్నూలు, రాజమహేంద్రవరం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం కాగా, తెలంగాణలో హైదరాబాద్, కరీంగర్, ఖమ్మం, మహబూబ్‌నగర్, నల్గొండ, వరంగల్‌లలో పరీక్ష కేంద్రాలున్నాయి. పోస్టుని బట్టి 1200-2300 వరకూ ఫీజు ఉంటుంది.
ఇతర వివరాలు, దరఖాస్తుకు అధికారి వెబ్‌సైట్ https://kvsangathan.nic.in/ సంప్రదించాలి.
Also read: CM Nitish Kumar: సారా తాగితే చావడం ఖాయం.. కల్తీ మద్యం మరణాలపై సీఎం నితీశ్ కుమార్ అనుచిత వ్యాఖ్యలు
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook