Jamili Elections: జమిలి ఎన్నికల విషయంలో కీలక నిర్ణయం, సిద్ధమైన లా కమీషన్ నివేదిక
Jamili Elections: గత కొన్నేళ్లుగా విన్పిస్తున్న జమిలి ఎన్నికలకు గ్నీన్ సిగ్నల్ లభించినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి లా కమీషన్ నివేదిక సిద్ధం చేసిందని సమాచారం. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Jamili Elections: కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి దేశంలో ఒకే ఎన్నికలు, ఒకే దేశం నినాదం అప్పడప్పుడూ విన్పిస్తూ వస్తోంది. ఇందులో భాగంగానే జమిలి ఎన్నికల ప్రస్తావన తెస్తోంది. కొన్ని రాజకీయ పార్టీలు వ్యతిరేకిస్తున్నా సరే ఎట్టి పరిస్థితుల్లోనూ అమలు చేయాలనేది బీజేపీ వ్యూహంగా కన్పిస్తోంది.
జమిలి ఎన్నికలపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధాని మోదీ గత కొంతకాలంగా లోక్‌సభతో పాటు దేశంలోని అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు జరపాలని బలమైన వాదనను తెరపైకి తెచ్చారు. అయితే ఈ ప్రతిపాదన కీలక దశకు చేరుకుంది. ప్రస్తుతం లా కమిషన్‌కు సిఫార్సు చేశారు. ఈ ప్రతిపాదన అమలు చేసేందుకు తగిన రోడ్ మ్యాప్ తయారు చేయాలని న్యాయ కమిషన్‌ను కోరారు. దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే భారీ ఎత్తున ప్రజాధనం, సమయం ఆదా అవుతాయని.. పోలింగ్ శాతం కూడా పెరుగుతుందని లా కమీషన్ భావిస్తోంది. దీనికి సంబంధించి నివేదికను లా కమీషన్ సిద్ధం చేసినట్టు సమాచారం.
మరోవైపు కేంద్ర ప్రభుత్వం ఇదే అంశంపై మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలో 14 మంది సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. ఇప్పటికే ఈ కమిటీ ఒకసారి భేటీ అయింది. తదుపరి భేటీలో రాజకీయ పార్టీలు, లా కమిషన్‌ను తమ అభిప్రాయాలు చెప్పేందుకు ఆహ్వానించింది. ఈ నేపథ్యంలో లా కమిషన్ జమిలి ఎన్నికలపై ఇవ్వబోతున్న నివేదిక కీలకంగా మారింది. ఈ నివేదికలో లా కమిషన్ పలు కీలక సిఫార్సులు చేసినట్లు తెలుస్తోంది. 2024, 2029 లో జమిలీ తరహాలో ఎన్నికలు నిర్వహించాలని కేంద్రానికి నివేదించినట్లు సమాచారం. అటు దేశవ్యాప్తంగా ఎన్నికలు ఎలా నిర్వహించాలో అన్నదానిపై, షెడ్యూల్‌పై కీలక సలహాలు, సూచనలు ఇవ్వనున్నట్లు సమాచారం.
జమిలి ఎన్నికల విషయంలో లా కమిషన్ భేటీ తర్వాత కేంద్ర న్యాయ శాఖకు ఈ రిపోర్టు పంపనున్నారు. 2018లో జస్టిస్ బిఎస్ చౌహన్ నేతృత్వంలోని 21వ లా కమిషన్ ముసాయిదా నివేదికలో ఒకే దేశం, ఒకే ఎన్నికలు ఆలోచనకు బీజం పడింది. ఇప్పుడు తాజాగా లా కమిషన్ చైర్మన్ రీతూరాజ్ అవస్తి నేతృత్వంలో కీలక భేటీలో దేశానికి జమిలీ ఎన్నికల శ్రేయస్కరమని ఒక నిర్ణయానికి రానున్నట్లు తెలుస్తోంది.
Also read: Judges Trolling Case: న్యాయమూర్తిని దూషించిన టీడీపీ నేత అరెస్ట్, ఇవాళ కోర్టులో హాజరుపర్చే అవకాశం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook