Jammu kashmir Elections: త్వరలో జమ్ముకశ్మీర్ ఎన్నికలు, రాష్ట్ర హోదా ఉంటుందా లేదా
Jammu kashmir Elections: జమ్ముకశ్మీర్‌లో త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. ఆర్టికల్ 370 రద్దు అనంతరం జరగనున్న తొలి ఎన్నికల కోసం దేశం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. జమ్ముకాశ్మీర్ ఎన్నికలపై అంతర్జాతీయ ఒత్డిడి ఉందనే వార్తల్లో నిజముందా..
Jammu kashmir Elections: జమ్ముకశ్మీర్‌లో త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. ఆర్టికల్ 370 రద్దు అనంతరం జరగనున్న తొలి ఎన్నికల కోసం దేశం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. జమ్ముకాశ్మీర్ ఎన్నికలపై అంతర్జాతీయ ఒత్డిడి ఉందనే వార్తల్లో నిజముందా..
జమ్ముకాశ్మీర్‌లో (Jammu kashmir) త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. దీనికి సంబంధించి రాజకీయ ప్రక్రియను ప్రారంభించేందుకు, కశ్మీర్‌కు రాష్ట్ర హోదా పునరుద్ధరణకు వివిధ పార్టీలతో చర్చించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. అయితే అధికారిక ప్రకటన విడుదల కాలేదు. మరోవైపు జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక హోదా పునరుద్ధరించాలన్న డిమాండ్‌పై ఏర్పాటైన గుప్కర్ కూటమి..కేంద్ర ప్రభుత్వంతో చర్చలకు అంగీకరించింది. అయితే నేషనల్ కాన్ఫరెన్స్ మాత్రం నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించి చర్చలకు మాత్రమే హాజరవుతామని స్పష్టం చేసింది.
2018లో కశ్మీర్‌లో రాష్ట్రపతి పాలన (President rule in kashmir) విధించారు. 2019 ఆగస్టు నెలలో జమ్ముకశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తిని నిర్వీర్యం చేస్తూ ఆర్టికల్ 370ను(Article 370 ) కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. వాస్తవానికి 2019 లోక్‌సభ ఎన్నికలతో పాటే కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉన్నా..భద్రతా కారణాల దృష్ట్యా నిర్వహించలేదు. మోదీ రెండవసారి అధికారంలో వచ్చాక..జమ్ముకశ్మీర్‌ను రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించింది. గత ఏడాది జరిగిన జమ్ముకశ్మీర్ స్థానిక ఎన్నికల్లో గుప్కర్ కూటమి 100కు పైగా స్థానాల్లో విజయం సాధించింది. మరోవైపు జమ్ము కశ్మీర్‌లో ఎన్నికలు(Jammu kashmir Elections) నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం(Central government) భావించడం వెనుక..అమెరికా ఒత్తిడి ఉందని సమాచారం. కశ్మీర్‌లో ప్రజాస్వామ్యబద్ధంగా అమెరికా ఒత్తిడి ఉందనే వార్తలు వస్తున్నాయి. కశ్మీర్‌లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహించడాన్ని జో బిడెన్ ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని ఆ దేశపు ఉన్నతాధికారి చెప్పడం దీనికి కారణం.
Also read: New Vaccination Policy: ప్రైవేటుకు వ్యాక్సిన్ సేకరణ కష్టమేనా.. కొత్త పాలసీ ఏం చెబుతోంది
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook