8th Pay Commission Updates: ప్రభుత్వ ఉద్యోగులకు ప్రస్తుతం 7వ వేతన సంఘం నడుస్తోంది. దీని ప్రకారం డీఏ పెంపు, డీఆర్ వంటివి అమలవుతున్నాయి. త్వరలో 8వ వేతన సంఘం అమలు కావల్సి ఉన్న నేపధ్యంలో ఆశగా ఎదురుచూస్తున్న ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రతి పదేళ్లకోసారి ప్రభుత్వం కొత్త వేతన సంఘాన్ని ఏర్పాటు చేస్తుంటుంది. ఈ వేతన సంఘాల ప్రకారమే ఉద్యోగుల జీతం, పెన్షనర్ల పెన్షన్ పెంపు ఆధారపడి ఉంటుంది. అందుకే ఉద్యోగుల విషయంలో వేతన సంఘం అనేది కీలకమైంది. ప్రస్తుతం 7వ వేతన సంఘం నడుస్తోంది. త్వరలో 8వ వేతన సంఘం అమలు కావల్సి ఉన్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం సమాధానం ఉద్యోగుల్లో నిరాశను మిగిల్చింది. వాస్తవానికి 8వ వేతన సంఘం ఏర్పాటుకై ఉద్యోగులు నిరీక్షిస్తున్నారు. రాజ్యసభలో దీనికి సంబంధించిన ఓ ప్రశ్నకు సమాధానంగా..కేంద్ర సహాయ మంత్రి పంకజ్ చౌధురి ప్రస్తుతానికి అలాంటి ప్రతిపాదనేదీ లేదని చెప్పారు. అంటే 8వ వేతన సంఘం ఏర్పాటు పరిశీలనలో కూడా లేదన్నారు.


రాజ్యసభ సభ్యుడు రామ్‌నాథ్ ఠాకూర్ అడిగిన ప్రశ్నకు లభించిన సమాధానమిది. 7వ వేతన సంఘం ప్రకారం పే రివిజన్ , అలవెన్స్ సమయంలో 8వ వేతన సంఘం గురించి ఆలోచించలేదన్నారు. 7వ వేతన సంఘం ప్రకారం ఐదేళ్ల తరువాత ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ సమీక్షించాల్సి ఉంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతం పెంపుకు ఇది కారణమౌతుంది. కానీ ప్రభుత్వం అమలు చేయడం లేదు. వేతన సంఘం సిఫారసుల్ని భరించే పరిస్థితి లేకపోవడం వల్లనే 8వ వేతన సంఘాన్ని ఏర్పాటు చేయలేదా అని ప్రశ్నించారు. ప్రపంచంలో 5వ అతిపెద్ద ఆర్ధిక శక్తిగా ప్రకటించుకునే కేంద్ర ప్రభుత్వం 8వ వేతన సంఘాన్ని ఎందుకు ఏర్పాటు చేయలేకపోయిదని రామ్‌నాథ్ ఠాకూర్ నిలదీశారు. 


ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు చాలాకాలంగా 8వ వేతన సంఘం ఏర్పాటుకై అడుగుతున్నారు. ప్రతి పదేళ్లకోసారి ఉద్యోగుల జీతం, పెన్షనర్ల పెన్షన్ పెంపుకై ప్రభుత్వం వేతన సంఘం ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఉన్న 7వ వేతన సంఘం 2014లో ఏర్పాటైంది. ఆ వేతన సంఘం సిఫారసులు మాత్రం 2016 జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చాయి. 


ప్రతిసారీ ప్రభుత్వం ఏఐసీపీఐ ఇండెక్స్ ఆధారంగా డీఏ పెంపు గురించి ఆలోచిస్తుందే తప్ప 8వ వేతన సంఘం ఏర్పాటు గురించి పరిశీలన చేయడం లేదు. ఇప్పుడు రాజ్యసభలో కేంద్ర ఆర్ధిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదురి ఇచ్చిన సమాధానంతో ఆ ఆశలపై నీళ్లు చల్లేసింది ప్రభుత్వం. ప్రస్తుతానికి అలాంటి ఆలోచన లేదని చెప్పింది..


Also read: LokSabha Elections 2024: ఎర్రకోటపై జెండా పాతేదెవరు..? తెలుగు రాష్ట్రాల్లో ఏ పార్టీకి ఎన్ని ఎంపీ సీట్లు.. లోక్‌సభ ఎన్నికలపై జీ న్యూస్ సర్వే



 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook