LokSabha Elections 2024: ఎర్రకోటపై జెండా పాతేదెవరు..? తెలుగు రాష్ట్రాల్లో ఏ పార్టీకి ఎన్ని ఎంపీ సీట్లు.. లోక్‌సభ ఎన్నికలపై జీ న్యూస్ సర్వే

Zee Telugu News Survey On LokSabha Elections 2024: రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఏ పార్టీ విజయం సాధించనుంది..? బీజేపీ హ్యాట్రిక్ విజయంతో మళ్లీ అధికారంలోకి వస్తుందా..? ఇండియా కూటమి పుంజుకుంటుందా..? తెలుగు రాష్ట్రాల్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి..? జీ తెలుగు న్యూస్ సర్వేలో సంచలన విషయాలు వెల్లడయ్యాయి. ఆ వివరాలు మీ కోసం..   

Written by - Ashok Krindinti | Last Updated : Mar 1, 2024, 10:57 PM IST
LokSabha Elections 2024: ఎర్రకోటపై జెండా పాతేదెవరు..? తెలుగు రాష్ట్రాల్లో ఏ పార్టీకి ఎన్ని ఎంపీ సీట్లు.. లోక్‌సభ ఎన్నికలపై జీ న్యూస్ సర్వే

Zee Telugu News Survey On LokSabha Elections 2024: కేంద్రంలో బీజేపీ కూటమి హ్యాట్రిక్ కొడుతుందా..? విపక్షాల ఇండియా కూటమి ఎర్రకోటపై జెండా ఎగురవేస్తుందా..? హంగ్ వచ్చి చిన్నపార్టీలు సర్కార్ ఏర్పాటులో కీలకం కాబోతున్నాయా..? సార్వత్రిక ఎన్నికల వేళ ఫలితాలపై దేశ వ్యాప్తంగా ఇదే చర్చ జరుగుతోంది. మూడోసారి మోడీ ప్రధాని కావడం ఖాయమని కమల దళం ధీమా వ్యక్తం చేస్తుండగా.. బీజేపీని ఇంటికి పంపించడం ఖాయమంటోంది విపక్ష కూటమి. అయితే ఎన్నికల వేళ దేశ ప్రజల మూడ్ తెలుసుకునే ప్రయత్నం చేసింది జీన్యూస్. మ్యాట్రిజ్ సంస్థతో కలిసి ఓపీనియన్ పోల్ నిర్వహించింది. దేశంలోని మొత్తం 543 నియోజకవర్గాల నుంచి ఓటర్ల అభిప్రాయాలు సేకరించింది. లక్షా 64 వేలకు పైగా శాంపిల్స్ సేకరించి అత్యంత పారదర్శకంగా రాష్ట్రాల వారీగా ఓపీనియన్ పోల్ ఫలితాలు వెల్లడించింది. 
 
==> ఫిబ్రవరి 5- ఫిబ్రవరి 27 మధ్య  అభిప్రాయ సేకరణ 
==> దేశంలోని మొత్తం 543 లోక్‌సభ నియోజకవర్గాల శాంపిల్స్  
==> 1,67,843 మంది ఓటర్ల అభిప్రాయాలు సేకరణ

ఆంధ్రప్రదేశ్  లోక్‌సభ సీట్లు (25)

==> వైసీపీ              19     
==> టీడీపీ              06       
==> బీజేపీ              00               
==> కాంగ్రెస్           00               

ఏపీ  ఓట్ల శాతం  

==> వైసీపీ               48
==> టీడీపీ              44 
==> బీజేపీ              04
==> కాంగ్రెస్           02
==> ఇతరులు         02 

తెలంగాణ లోక్ సభ సీట్లు (17)

==> కాంగ్రెస్         09      
==> బీజేపీ            05      
==> బీఆర్ఎస్      02    
==> ఎంఐఎం       01 

తెలంగాణ ఓట్ల శాతం

==> కాంగ్రెస్         40 శాతం     
==> బీజేపీ            23 శాతం     
==> ఇతరులు      37 శాతం 

లోక్‌సభ ఎన్నికలపై జీ న్యూస్ సర్వే  (543)

==> NDA      377       
==> INDIA    094
==> OTHERS   072 

ఓట్ల శాతం

==> NDA     43.6 శాతం
==> INDIA   27.7 శాతం
==> OTHERS  24.9 శాతం 

Also Read: Best Battery Mobile: అవును ఇది నిజం..28,000mAh బ్యాటరీతో మార్కెట్‌లోకి కొత్త మొబైల్‌..1 గంట ఛార్జ్‌ చేస్తే 94 రోజుల పాటు స్టాండ్‌బై..

Also Read: Poco M6 5G Vs Poco M6 Pro 5G: తక్కువ ధరలో లభించే ఈ రెండు శక్తివంతమైన మొబైల్స్‌లో ఇదే బెస్ట్‌..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News