కేంద్ర పాలిత ప్రాంతం జమ్మూ కాశ్మీర్ భూభాగాన్ని తప్పు మ్యాప్‌తో లింక్‌ చేశారని, దాన్ని సాధ్యమైనంత త్వరగా తొలగించాలని కేంద్ర ప్రభుత్వం వికీపీడియా (Wikipedia)కు సూచించినట్లు జాతీయ మీడియా నివేదికలు చెబుతున్నాయి. మరోవైపు భారతదేశం-భూటాన్ భూభాగానికి సంబంధించిన వికీపీడియా పేజీలో ఈ మ్యాప్ లింక్ చేసినట్లు కనిపించింది. ఈ మ్యాప్‌లో అక్సాయ్ చిన్ ప్రాంతాన్ని చైనాలో భాగంగా చూపిస్తుందని హిందుస్తాన్ టైమ్స్ రిపోర్ట్ చేసింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ఐటీ చట్టం 2000లోని సెక్షన్ 69ఏ ప్రకారం ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ నవంబర్ 27న వికీపీడియా (Wikipedia)కు సూచించిందని సమాచారం. భారతదేశం-భూటాన్ సరిహద్దులకు సంబంధించిన అంశాలపై వికీపీడియా పేజీలో జమ్మూ కాశ్మీర్‌ (Jammu and Kashmir) మ్యాప్‌ను తప్పుగా చూపించారు. ఈ విషయాన్ని ట్విట్టర్ యూజర్ హైలైట్ చేసినట్లు పీటీఐ తెలిపింది. అదే సమయంలో దీనిపై చర్య తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరింది. 


Also Read : Benifits Of EPF Account: మీకు ఈపీఎఫ్ అకౌంట్ ఉందా.. ఈ బెనిఫిట్స్ తెలుసా!


 


భారతదేశ సమగ్రతను మరియు సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించినందున మ్యాప్‌కు లింక్‌ను తొలగించమని ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వశాఖ వికీపీడియాకు సూచించినట్లు సమాచారం. దీనిపై సత్వరమే స్పందిచి తప్పును సరిచేసుకోని పక్షంలో కేంద్ర ప్రభుత్వం వికీపీడియాపై చట్టపరమైన చర్యలు తీసుకోగలదు. అవసరమైతే వికీపీడియాను దేశంలో బ్లాక్ చేసే వరకు వెళ్లొచ్చునని కథనాలు వస్తున్నాయి.


Also Read : Motor Vehicle New Rules: వాహనదారులు తెలుసుకోవాల్సిన కొత్త రూల్స్ ఇవే!


 


భారతదేశ పటాన్ని తప్పుగా చూపించడం ఈ ఏడాది ఇది తొలిసారి కాదు. లేహ్ ప్రాంతాన్ని లఢాఖ్ కేంద్రపాలిత ప్రాంతానికి బదులుగా జమ్మూకాశ్మీర్ లోని ప్రాంతంగా ట్విట్టర్ మ్యాప్ చూపించింది. దీంతో కేంద్ర ప్రభుత్వం నోటీసులు జారీ చేయడంతో మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ క్షమాపణలు చెప్పడం తెలిసిందే. 


Also Read : Prabhas With KGF Director: క్రేజీ కాంబినేషన్.. మరో పాన్ ఇండియా మూవీకి భారీ ప్లాన్ 


 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


  • మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook