Prabhas With KGF Director: క్రేజీ కాంబినేషన్.. మరో పాన్ ఇండియా మూవీకి భారీ ప్లాన్

  • Dec 02, 2020, 16:37 PM IST

Prabhas Next Movie Titled As SALAAR | ఇటీవల జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు లేదా రెబల్ స్టార్ ప్రభాస్‌లలో ఒకరితో కేజీఎఫ్ డైరెక్టర్ సినిమ చేస్తారని ప్రచారం జరిగింది. ఇప్పుడే అదే మాట నిజమైంది. భారత సినీ చరిత్రలో మరో పాన్ ఇండియా మూవీకి రంగం సిద్ధమైంది.

1 /10

Prabhas Next with KGF Director Prashanth Neel | కేజీఫ్ చిత్రంతో సౌతిండియాతో పాటు నార్త్ ఇండియాను టచ్ చేశాడు దర్శకుడు ప్రశాంత్ నీల్. అతడి దర్శకత్వంలో ఇప్పటికే కేజీఎఫ్ ఛాప్టర్ 2 తెరకెక్కుతోంది. అయితే ఆ సినిమాను మించిపోయేలా మరో సినిమా కోసం దక్షిణాదితో పాటు ఉత్తరాది ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఊహించినట్లుగానే భారీ అప్‌డేట్‌ను అందించారు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ‘సలార్’ మూవీని ప్రకటించి ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్ చేశారు.

2 /10

బాహుబలి తర్వాత ఉత్తరాదితో పాటు ప్రపంచ వ్యాప్తంగా ప్రభాస్ గుర్తింపు పొందాడు. ఇప్పుడు ఈ క్రేజ్‌ను క్యాష్ చేసుకునేందుకు హోంబలే చిత్ర నిర్మాణ సంస్థ ప్రభాస్, కేజీఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌తో భారీ ప్రాజెక్టుకు రంగం సిద్ధం చేసింది. (Photo: Twitter)

3 /10

కేజీఎఫ్ సినిమా తెరకెక్కించిన హోంబలే చిత్ర నిర్మాణ సంస్థ సోషల్ మీడియా మైక్రో బ్లాగింగ్ వెబ్‌సైట్ ట్విట్టర్‌లో పాన్ ఇండియా మూవీ ‘సలార్’ను అనౌన్స్ చేసింది. 

4 /10

రెబల్ స్టార్ ప్రభాస్ లేటెస్ట్ ప్రాజెక్ట్ ఆదిపురుష్ సైతం 2021లోనే పట్టాలెక్కనుంది. గతంలో సినిమాలకు చాలా టైమ్ తీసుకునే డార్లింగ్ ప్రస్తుతం వేగం పెంచుతున్నాడు. ఆదిపురుష్ పట్టాలెక్కక ముందే కొత్త ప్రాజెక్టు ఒప్పుకోవడంతో ఫ్యాన్స్ సర్‌ప్రైజ్ అవుతున్నారు.

5 /10

నాగ్ అశ్విన్ తెరకెక్కించనున్న మరో సినిమాలో కూడా ప్రభాస్ కనిపించనున్నాడు. ఇందులో దీపికా పదుకొనే కథానాయిక కాగా అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో కనిపించనున్నాడు.  

6 /10

ప్రస్తుతం పూజా హెగ్డే, ప్రభాస్ జోడీగా రాధేశ్యామ్ తెరకెక్కుతోంది. ఈ సినిమా షూటింగ్ షెడ్యూల్ త్వరలోనే పూర్తి కానుంది. ఇప్పటివరకూ రాధేశ్యామ్ అప్‌డేట్స్ వచ్చేవి. ఇకనుంచి సలార్ మూవీ అప్‌డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తారు.

7 /10

ఇటీవల జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు లేదా రెబల్ స్టార్ ప్రభాస్‌లలో ఒకరితో కేజీఎఫ్ డైరెక్టర్ సినిమ చేస్తారని ప్రచారం జరిగింది. ఇప్పుడే అదే మాట నిజమైంది. భారత సినీ చరిత్రలో మరో పాన్ ఇండియా మూవీకి రంగం సిద్ధమైంది.

8 /10

ప్రస్తుతం పూజా హెగ్డే, ప్రభాస్ జోడీగా రాధేశ్యామ్ తెరకెక్కుతోంది. ఈ సినిమా షూటింగ్ షెడ్యూల్ త్వరలోనే పూర్తి కానుంది. Photos : Pooja Bhalekar Photos: RGV హీరోయిన్ పూజా భలేకర్ ఫొటోస్ ట్రెండింగ్

9 /10

రెబల్ స్టార్ ప్రభాస్ తన ఫేస్‌బుక్‌లో ఇందుకు సంబంధించి మరింత అప్‌డేట్ అందించాడు. సలార్ ప్రపంచంలోకి నేను వెళ్లబోతున్నాను. వచ్చే ఏడాది జనవరిలో సలార్ షూటింగ్ ప్రారంభం కాబోతుందని అభిమానులకు శుభవార్త అందించాడు ప్రభాస్.

10 /10

ప్రభాస్ లేటెస్ట్ మూవీ సలార్ (SALAAR)ను కేజీఎఫ్ తెరకెక్కించిన డాషింగ్ డైరెక్టర్ ప్రశాంత్ తెరకెక్కించనున్నాడు. దీంతో అభిమానులలో అంచనాలు పెరిగిపోతున్నాయి. Also Read :  Voting Numbers of Bigg Boss 4 Contestants: ఓటింగ్ నెంబర్స్ ఇవే.. మిస్డ్ కాల్స్‌తో కంటెస్టెంట్‌ను సేవ్ చేయవచ్చు