Wrong Parking: రాంగ్ పార్కింగ్‌లో బండి పెట్టారా..ఫోటో పంపితే 5 వందలు గిఫ్ట్ మనీ
Wrong Parking: పట్టణాల్లో..నగరాల్లో ఎక్కడ చూసినా రాంగ్ పార్కింగ్ కేసులు పెరిగిపోతున్నాయి. రాంగ్ పార్కింగ్‌కు చెక్ పెట్టేందుకు కేంద్రం వినూత్నంగా ఆలోచించింది. కొత్త స్కీమ్ ప్రవేశపెడుతోంది.
Wrong Parking: పట్టణాల్లో..నగరాల్లో ఎక్కడ చూసినా రాంగ్ పార్కింగ్ కేసులు పెరిగిపోతున్నాయి. రాంగ్ పార్కింగ్‌కు చెక్ పెట్టేందుకు కేంద్రం వినూత్నంగా ఆలోచించింది. కొత్త స్కీమ్ ప్రవేశపెడుతోంది.
దేశవ్యాప్తంగా ప్రతి రాష్ట్రంలోనూ రాంగ్ పార్కింగ్ సమస్య తీవ్రమౌతోంది. ఎక్కడికి వెళ్లినా సరే..పార్కింగ్ సౌకర్యం లేకపోవడంతో రోడ్డుపైనే..రాంగ్ స్థానాల్లో పార్క్ చేస్తుంటాం. ఇది దేశవ్యాప్తంగా ప్రధాన సమస్యగా మారుతోంది. ట్రాఫిక్ జామ్ కావడం, రోడ్డు ప్రమాదాలు అన్నింటికీ రాంగ్ పార్కింగ్ కారణంగా ఉంది. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం వినూత్న పథకాన్ని ప్రవేశపెట్టబోతోంది. త్వరలోనే దీనికోసం ఓ చట్టం కూడా తీసుకురానున్నామని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు.
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న కొత్త స్కీమ్ ప్రకారం రాంగ్ పార్కింగ్ చేస్తే ఇకపై వేయి రూపాయలు స్పాట్‌లో జరిమానా పడుతుంది. అంతేకాకుండా రాంగ్ పార్కింగ్ వాహనం ఫోటో తీసి పంపితే..పంపిన వ్యక్తికి 5 వందల రూపాయలు బహుమానం అతని ఎక్కౌంట్‌లో జమవుతాయి. ఇలా చేయడం వల్ల రాంగ్ పార్కింగ్ సమస్యకు చాలావరకు చెక్ పెట్టవచ్చని భావిస్తున్నారు.
Also read: Central Government: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్, జూలై నెలలో త్రిపుల్ బంపర్ ఆఫర్
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook