E Passports: త్వరలో ఇండియాలో ఇ పాస్‌పోర్ట్‌లు జారీ, ఎలా పనిచేస్తాయంటే
E Passports: ఇ పాస్‌పోర్ట్‌లపై కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. అతి త్వరలోనే ఇ పాస్‌పోర్ట్‌లు రానున్నాయి. నకిలీ పాస్‌పోర్డ్ బెడద తగ్గించేందుకు, డేటా సురక్షితంంగా ఉండేందుకు ఇవి దోహదపడతాయి.
E Passports: ఇ పాస్‌పోర్ట్‌లపై కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. అతి త్వరలోనే ఇ పాస్‌పోర్ట్‌లు రానున్నాయి. నకిలీ పాస్‌పోర్డ్ బెడద తగ్గించేందుకు, డేటా సురక్షితంంగా ఉండేందుకు ఇవి దోహదపడతాయి.
పాస్‌పోర్ట్ సేవా ప్రాజెక్టులో బాగంగా కేంద్ర ప్రభుత్వం త్వరలో ఇ పాస్‌పోర్ట్‌లు ప్రవేశపెట్టనుంది. చాలాకాలం నుంచి ఇ పాస్‌పోర్ట్‌ల గురించి చర్చ నడుస్తున్నా..ఎప్పుడు వస్తాయనే విషయంపై ఇన్నాళ్లూ సందిగ్దత నెలకొంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఈ విషయమై స్పష్టత ఇచ్చింది. ఇ పాస్‌పోర్ట్‌లను త్వరలో అంటే ఏడాది చివరికి జారీ చేయనున్నట్టు వెల్లడించింది.
ఇ పాస్‌పోర్ట్‌ల వల్ల నకిలీ పాస్‌పోర్ట్‌ల బెడద తగ్గనుంది. మరోవైపు పాస్‌పోర్ట్ పోగొట్టుకున్నప్పుడు విలువైన వ్యక్తిగత సమాచారం ఇతరులకు చిక్కే అవకాశముంది. ఈ పరిస్థితి ఇకపై ఉండదు. పాస్‌పోర్ట్ ఎక్కడైనా పోగొట్టుకునే పనుండదు. అంతర్జాతీయ ప్రయాణాలు సులభతరం కావడమే కాకుండా..పాస్‌పోర్ట్ కలిగిన వ్యక్తుల డేటా సురక్షితంగా ఉండనుంది. నకిలీకు అడ్డుకట్టు పడుతుంది. ఈ ఏడాది చివరి నాటికి ఇ పాస్‌పోర్ట్‌లు జారీ చేస్తామని..పాస్‌పోర్ట్ విభాగంలో సంస్కరణలతో ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలనే ఉద్దేశ్యంతో ఇ పాస్‌పోర్ట్‌లు తీసుకొస్తున్నామని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ తెలిపారు.
ఎలా పని చేస్తాయి
వాస్తవానికి ఇ పాస్‌పోర్ట్ అనేది కొత్తది కాదు. ఇప్పటికే 100కు పైగా దేశాలు అవలంభిస్తున్నాయి. ఇప్పుడున్న పాస్‌పోర్ట్‌లానే ఇ పాస్‌పోర్ట్ ఉంటుంది. డేటా భద్రత, విదేశాల్లో ఇమిగ్రేషన్ ప్రక్రియ సులభతరమయ్యేందుకు ఎలక్ట్రానిక్ చిప్ నిక్షిప్తం చేస్తారు. ఈ చిప్‌లో సంబంధిత వ్యక్తి,పేరు, చిరునామా, పుట్టినతేదీ, వయస్సు వంటి కీలక వివరాలుంటాయి. ఇదొక రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ చిప్. వెనుకన చిన్న యాంటినా ఉంటుంది. ఫలితంగా ప్రయాణీకుడి వివరాల్ని వేగంగా వెరిఫై చేయవచ్చు. ఇ పాస్‌పోర్ట్ సేవలు దేశంలో టీసీఎస్ కంపెనీ ద్వారా అందనున్నాయి.
Also read: Privatization: దేశంలో కొనసాగుతున్న ప్రైవేటీకరణ, టాటా చేతికి చిక్కిన మరో ప్రభుత్వ కంపెనీ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.