Covid XE Variant: దేశంలో కొత్త వేరియంట్ కలకలం..ఐదు రాష్ట్రాలకు కీలక ఆదేశాలు
Covid XE Variant: దేశంలో మరోసారి కరోనా కేసులు భయాలు పెరుగతున్నాయి. దీనితో కేంద్రం పలు రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. కొవిడ్ నిబంధనలు మరోసారి కఠినతరం చేయాలని సూచించింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Covid XE Variant: దేశంలో కొత్త వేరియంట్ కలకలం రేపుతోంది. దీంతో కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. గతకొంతకాలంగా పాజిటివ్ కేసులు పెరుగుతున్న రాష్ట్రాలను అలర్ట్ చేసింది. కోవిడ్ నిబంధనలను కఠినతరం చేయాలని ఐదు రాష్ట్రాలకు సూచించింది. కేరళ, హర్యానా, ఢిల్లీ, మహారాష్ట్ర, మిజోరాం రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. దీంతో ఈ ఐదు రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్ లేఖ రాశారు. వ్యాక్సినేషన్, కరోనా పరీక్షలను ముమ్మరం చేయాలని లేఖలో పేర్కొన్నారు.
వివిధ రాష్ట్రాల్లో కేసులు..
ఢిల్లీలో గత వారం రోజులుగా కేసులు పెరుగుతున్నాయి. పాజిటివిటీ రేటు 0.51 శాతం నుంచి 1.25 శాతానికి పెరిగింది. కేరళలో 2 వేల 321 కేసులు నమోదయ్యాయి. పాజిటివిటీ రేటు 15.33 శాతంగా ఉంది. హర్యానాలో 0.51 శాతం నుంచి 1.06 శాతానికి పాజిటివిటీ రేటు పెరిగింది. మహారాష్ట్రలో 794 కేసులు వెలుగు చూశాయి. పాజిటివిటీ కూడా పెరుగుతోంది. మిజోరాంలో వారం వారీ కేసులు 814కి పెరిగాయి. పాజిటివిటీ 14.38 శాతం నుంచి 16.48 శాతానికి పెరిగింది.
కొత్త వేరియంట్ కేసులు..
మరోవైపు ఒమిక్రాన్ కొత్త వేరియంట్ ఎక్స్‌ఈ కేసులు దేశంలో పెరుగుతున్నాయి. తాజాగా గుజరాత్‌లోనూ తొలి కేసు నమోదు అయినట్లు తెలుస్తోంది. ఇటీవల ముంబైలో ఈతరహా కేసు నమోదు అయ్యింది. దీంతో కేంద్ర ఆరోగ్య శాఖ అలర్ట్ అయ్యింది. 18 ఏళ్లు పైబడిన వారికి బూస్టర్ డోస్ ఇవ్వాలని నిర్ణయించింది. ప్రైవేట్ కేంద్రాల్లో వీటి పంపకం ఉంటుందని కేంద్రం స్పష్టం చేసింది.
Also read: AR Rahaman Counter: అమిత్ షా 'హిందీ' కామెంట్స్‌పై ఏఆర్ రెహమాన్ గట్టి కౌంటర్...
Also read: Precaution Doses: 18 ఏళ్లు నిండిన వారందరికీ ప్రికాషన్ టీకా.. ఒక్క డోసు ధర ఎంతంటే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook