Ration Card: ప్రజలకు కేంద్రం హెచ్చరిక.. ఆ రేషన్ కార్డులు రద్దుకు నిర్ణయం
Ration Card Cancellation Rules: నకిలీ పద్ధతిలో రేషన్ కార్డు తీసుకుని.. కేంద్ర ప్రభుత్వం నుంచి లబ్ధి పొందుతున్న వారికి అలర్ట్. ఈ కార్డులన్నీ రద్దు చేయడంతోపాటు కఠిన చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ప్రజలే స్వయంగా కార్డులను సరెండర్ చేయాలన కేంద్రం కోరుతోంది.
Ration Card Cancellation Rules: రేషన్ కార్డుదారులకు కేంద్ర ప్రభుత్వం హెచ్చరిక జారీ చేసింది. నకిలీ పద్ధతిలో రేషన్ పొందుతున్న వారిపై చర్యలు తీసుకునేందుకు రెడీ అవుతోంది. తప్పుడు ఆధారాలు సమర్పించి రేషన్ పొందుతున్న వారు స్వయంగా తమ కార్డులను రద్దు చేసుకోవాలని సూచిస్తోంది. రేషన్‌కార్డును రద్దు చేయకుంటే ఆహార శాఖ బృందం పరిశీలన అనంతరం కార్డు రద్దు చేయడంతోపాటు కఠిన చర్యలు కూడా తప్పవని చెబుతోంది. దేశంలో సుమారు 10 లక్షల మంది అక్రమంగా రేషన్ పొందుతున్నట్లు గతేడాది ప్రభుత్వం గుర్తించింది.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా దాదాపు 80 కోట్ల మంది ప్రజలు కేంద్ర ప్రభుత్వం పంపిణీ చేస్తున్న ఫ్రీ రేషన్ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. బియ్యం, గోధమలు, కందిపప్పు ప్రజలకు అందజేస్తోంది. నకిలీ పద్ధతిలో రేషన్ కార్డు పొందినవారికి వీటి సరఫరా బంద్ చేయాలని ప్రభుత్వం గతేడాదే నిర్ణయం తీసుకుంది. అనర్హులందరీ పూర్తి జాబితాను రేషన్ డీలర్లకు పంపుతామని చెప్పింది. ఆ లిస్టు వారి వద్దకు చేరగానే.. నకిలీ కార్డులు కలిగిన వారికి రేషన్ ఆగిపోతుందని పేర్కొంది. ప్రస్తుతం ఆ ప్రక్రియ ఇంకా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.
ఇన్‌కమ్ ట్యాక్స్ చెల్లించే వారు లేదా 10 ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉన్న వారు రేషన్ పొందేందుకు అనర్హులని కేంద్రం చెబుతోంది. కార్డు హోల్డర్‌కు 100 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ప్లాట్/ఫ్లాట్ లేదా ఇల్లు, ఫోర్ వీలర్/ట్రాక్టర్, ఆయుధాల లైసెన్స్, కుటుంబ ఆదాయం గ్రామంలో రెండు లక్షలు, నగరంలో మూడు లక్షల కంటే ఎక్కువ ఉంటే.. అలాంటి వ్యక్తులు రేషన్ కార్డు వదులుకోవాలని ప్రభుత్వం చెబుతోంది. అనర్హులు తమ రేషన్ కార్డులను తహసీల్దార్ కార్యాలయంలో సరెండర్ చేయాలని సూచిస్తోంది.
ఉచిత రేషన్‌తో వ్యాపారం చేసేవారిపై కూడా కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకునేందుకు రెడీ అవుతోంది. నాలుగు నెలలపాటు రేషన్ తీసుకోని వారి కార్డులు కూడా రద్దు అవుతాయని హెచ్చరిస్తోంది. రేషన్‌కార్డు హోల్డర్ కార్డును సరెండర్ చేయకపోతే ప్రభుత్వ నిబంధనల ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకుంటుంది. విచారణ అనంతరం వారి కార్డును రద్దు చేస్తారు. దీంతో పాటు ఆ కుటుంబంపై చట్టపరమైన చర్యలు కూడా తీసుకోవచ్చు. అంతేకాదు వారి నుంచి రేషన్ కూడా రికవరీ చేయనుంది.
Also Read: Minister KTR: రేవంత్ రెడ్డి, బండి సంజయ్‌లకు మంత్రి కేటీఆర్ లీగల్ నోటీసులు
Also Read: Ind Vs Aus: నీ యవ్వ తగ్గేదేలే.. డేవిడ్ వార్నర్ పుష్ప స్టైల్‌లో సంబురాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి