Amit shah: కాంగ్రెస్, లెఫ్ట్, తృణమూల్ కాంగ్రెస్..మూడు పార్టీల ప్రభుత్వాల్ని చూశారు. ఒక్కసారి బీజేపీకు అవకాశమివ్వండి..స్వర్ణ బెంగాల్ సాధిస్తాం..ఇదీ కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇస్తున్న హామీ..మరి బెంగాల్ ప్రజలేమంటున్నారు..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


పశ్చిమ బెంగాల్ ( West Bengal ) లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ( Union home minister Amit shah ) పర్యటన కొనసాగుతోంది. పశ్చిమ బెంగాల్ ప్రజలు మార్పును కోరుకుంటున్నారని అమిత్ షా వ్యాఖ్యానించారు. అభివృద్ధి కోసం బీజేపీ ( BJP ) ను ఎంచుకున్నారని చెప్పారు. ఈ సందర్బంగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై నిప్పులు చెరిగారు.  మమతా ( Mamata Benerjee ) దీదీపై బెంగాల్ ప్రజలకున్న కోపానికి నిదర్శనమే ఈ రోడ్ అని..ఇలాంటి రోడ్ షో తన జీవితంలో చూడలేదని చెప్పారు అమిత్ షా. 


ప్రధాని మోదీపై బెంగాల్ ప్రజలకు ఉన్న ప్రేమ, నమ్మకానికి ఈ రోడ్ షో ఉదాహరణగా చెప్పారు. ఒక్కసారి బీజేపీకు అవకాశమిస్తే..ఐదేళ్లలో స్వర్ణ బెంగాల్ సాధిస్తామన్నారు. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోసం బీజేపీ ఇప్పటి నుంచే పావులు కదుపుతోంది. కొద్దిరోజుల క్రితం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ( Jp Nadda ) పర్యటన..ఇప్పుడు కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటిస్తుండటంతో  బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం పెల్లుబుకుతోంది. ఇప్పటికే పలువురు టీఎంసీ ఎమ్మెల్యేలు, నేతలు బీజేపీ తీర్ధం పుచ్చుకున్నారు. 


Also read: Bullet train: ముంబై అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ ఫస్ట్ లుక్ చూశారా