West Bengal Election: దేశంలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు మాత్రం ఏకంగా 8 దశల్లో జరగనున్నాయి. ఇదే ఇప్పుడు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆగ్రహానికి కారణమైంది. దీని వెనుక మోదీ ఉన్నారా..అమిత్ షా ఉన్నారా అని దీదీ మండిపడ్డారు.
Mamata Banerjee: ఆకాశానికి నిచ్చెన వేసుకుంటున్న ఇంధన ధరలకు వ్యతిరేకంగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వినూత్నరీతిలో నిరసన తెలిపారు. రాష్ట్ర సచివాయానికి ఎలక్ట్రిక్ స్కూటీలో చేరుకున్నారు. నిరసనగా మెడలో ప్రకార్డులు ప్రదర్శించారు.
Mamata Banerjee Travels On Scooter: రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో విమర్శల పర్వం కొనసాగుతోంది. ఈ క్రమంలో దీదీ మమతా బెనర్జీకి సరికొత్త అస్త్రం దొరికింది.
West bengal survey: దేశవ్యాప్తంగా ఉత్కంఠ కల్గిస్తున్న పశ్చిమ బెంగాల్ ఎన్నికలు త్వరలో జరగనున్నాయి. మరోసారి అధికారం దక్కించుకుని హ్యాట్రిక్ కోసం దీదీ ప్రయత్నిస్తుంటే.. బెంగాల్ పీఠంపై కాషాయ జెండా ఎగురవేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. ఈ నేపధ్యంలో ఆ సర్వేలు ఏం చెబుతున్నాయనేది ఆసక్తిగా మారింది.
West Bengal Elections: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. మరోసారి అధికారం దక్కించుకునేందుకు మమతా బెనర్జీ..గద్దె దించేందుకు బీజేపీ నేతలు పావులు కదుపుతున్నారు. టీఎంసీ సరికొత్త పథకానికి అంకురార్పణ చేసింది.
Rathyatra vs Bike Rally: దేశం మొత్తం ఇప్పుడు పశ్చిమ బెంగాల్ వైపు చూస్తోంది. మరో 2-3 నెలల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలే దీనికి కారణం. బెంగాల్ కోటపై కాషాయజెండా ఎగురవేసేందుకు బీజేపీ, మరోసారి పట్టు నిలుపుకునేందుకు టీఎంసీలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి.
West Bengal: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నేపధ్యంలో రాష్ట్రంలో రాజకీయం వేడెక్కుతోంది. పరిపాలనా వికేంద్రీకరణ జరగాలని..దేశానికి 4 రాజధానులుండాలని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంచలన ప్రకటన చేశారు.
13 people died in an accident in Dhupguri city of Jalpaiguri district: నిత్యం ఏదో చోట దారులు రక్తసిక్తమవుతున్నాయి. గత కొన్ని రోజులుగా పొగమంచు కారణంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో పశ్చిమ బెంగాల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బండరాళ్ల లోడ్‌తో వెళ్తున్న ఓ ట్రక్కు పొగమంచు కారణంగా అదుపుతప్పింది.
పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికలు దగ్గరపడుతుండటంతో రాజకీయాలు వెడెక్కుతున్నాయి. ఇప్పటికే ఇటు బీజేపీ, టీఎంసీ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ క్రమంలోనే మహారాష్ట్ర అధికార పార్టీ శివసేన కీలక నిర్ణయం తీసుకుంది.
బీసీసీఐ అధ్యక్షుడు, టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ గుండెపోటుకు గురై పశ్చిమ బెంగాల్ కోల్‌కతాలోని వుడ్‌ల్యాండ్స్ ఆసుపత్రిలో గత శనివారం (జనవరి 2న) చేరిన సంగతి తెలిసిందే. తాజగా గురువారం దాదా ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.
బీసీసీఐ అధ్యక్షుడు, టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ గుండెపోటుకు గురై కోల్‌కతాలోని వుడ్‌ల్యాండ్స్ ఆసుపత్రిలో శనివారం చేరారు. అయితే గంగూలీ గుండెకు మొత్తం మూడు స్టెంట్లు వేయనున్నట్లు వుడ్‌ల్యాండ్స్ ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు.
West Bengal: బీజేపీ పశ్చిమ బెంగాల్‌పై దృష్టి పెట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడు టీమ్ ఇండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ అధ్యక్షుడైన సౌరవ్ గంగూలీ బీజేపీ తీర్ధం పుచ్చుకోనున్నారనే వార్తలు వైరల్ అవుతున్నాయి.
PM KISAN Samman Nidhi Scheme news updates: కోల్‌కతా: పీఎం కిసాన్ సమ్మన్ నిధి పథకాన్ని పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో అమలు చేయకపోగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలను సగం సత్యంతో, వక్రీకరించిన మాటలతో తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నిస్తున్నారని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు.
పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికలు దగ్గరపడుతుండటంతో మమతా ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. బెంగాల్‌లో తెలుగు భాషకు అధికార హోదా ఇస్తూ టీఎంసీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
పశ్చిమ బెంగాల్లో పర్యటిస్తున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా పౌరసత్వ సవరణ చట్టం (CAA) పై కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో కరోనావైరస్ వ్యాక్సినేషన్ ప్రారంభమైన వెంటనే సీఏఏ అమలును పరిశీలిస్తామని అమిత్ షా (Amit Shah) ప్రకటించారు.
Amit shah: కాంగ్రెస్, లెఫ్ట్, తృణమూల్ కాంగ్రెస్..మూడు పార్టీల ప్రభుత్వాల్ని చూశారు. ఒక్కసారి బీజేపీకు అవకాశమివ్వండి..స్వర్ణ బెంగాల్ సాధిస్తాం..ఇదీ కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇస్తున్న హామీ..మరి బెంగాల్ ప్రజలేమంటున్నారు..
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఎంఐఎం పార్టీ ఆసక్తి చూపిస్తున్నట్టు తెలుస్తోంది. పశ్చిమ బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఆ రాష్ట్రంలో ఎంఐఎం పార్టీకి ప్రతినిధులుగా ఉన్న నేతలను హైదరాబాద్‌కి పిలిపించుకున్న ఆ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసి వారితో భేటీ అయ్యారు.
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కాన్వాయ్‌పై పశ్చిమ బెంగాల్‌లో జరిగిన దాడి కేసులో విచారణ ముమ్మరమైంది. మూడు కేసులు నమోదు చేసి...ఏడుగురిని అరెస్టు చేశారు.