Farmers strike: రైతుల సమ్మె వెనుక పాక్, చైనా కుట్ర దాగుంది: కేంద్రమంత్రి
Farmers strike: దేశ రాజధాని ఢిల్లీలో జరుగుతున్న రైతుల సమ్మెపై కేంద్రమంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సమ్మె వెనుక చైనా, పాక్ దేశాల హస్తముందని ఆరోపించారు. పొరుగుదేశాల పాత్ర ఉందనే ఆరోపణలు రాజకీయంగా అలజడి రేపుతున్నాయి.
Farmers strike: దేశ రాజధాని ఢిల్లీలో జరుగుతున్న రైతుల సమ్మెపై కేంద్రమంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సమ్మె వెనుక చైనా, పాక్ దేశాల హస్తముందని ఆరోపించారు. పొరుగు దేశాల పాత్ర ఉందనే ఆరోపణలు రాజకీయంగా అలజడి రేపుతున్నాయి.
కేంద్ర ప్రభుత్వం ( Central Government ) ప్రవేశపెట్టిన మూడు కొత్త వ్యవసాయ చట్టాలకు ( New farm acts ) వ్యతిరేకంగా దేశ రాజధాని ఢిల్లీ ( Delhi ) లో గత 13 రోజులుగా సమ్మె జరుగుతోంది. ఢిల్లీ రోడ్లపై వేలాది సంఖ్యలో చేరుకున్న రైతులు నిరసన బాట పట్టారు. డిసెంబర్ 8న ఇందులో భాగంగా భారత్ బంద్ ( Bharat Bandh ) కార్యక్రమం నిర్వహించారు. రైతుల సమ్మె ( Farmers strike )పై ఇప్పుడు కేంద్రమంత్రి రావు సాహెబ్ దన్వే ( Central minister danve ) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నూతన చట్టాల్ని వ్యతిరేకిస్తూ జరుగుతున్న ఆందోళన వెనుక చైనా, పాక్ దేశాల కుట్ర ఉందంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
రైతుల సమ్మె విషయంలో పొరుగుదేశాల ప్రస్తావన తీసుకురావడం రాజకీయంగా అలజడి రేపుతోంది. చైనా , పాక్ పేరు చెప్పి రైతుల్ని అవమానిస్తున్నారంటూ విపక్షాలు మండిపడుతున్నాయి. ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే..ఇంట్లో చొరబడి కొడతారని..మహారాష్ట్రకు చెందిన మంత్రి ఒకరు తీవ్రంగా స్పందించారు. రైతుల సమ్మె జరుగుతున్న ప్రాంతం పాకిస్తాన్ లో ఉందా అంటూ ప్రశ్నించారు.
రైతుల సమ్మె వెనుక పాక్, చైనా దేశాల కుట్ర ఉందంటూ మహారాష్ట్ర ( Maharashtra ) లో జరిగిన ఓ కార్యక్రమంలో కేంద్రమంత్రి దన్వే వ్యాఖ్యానించారు. దేశంలో ఏం జరిగినా ముస్లింలను ప్రేరేపిస్తారని..గతంలో పౌరసత్వ సవరణ చట్టం, ఎన్ఆర్సీ విషయంలో కూడా ముస్లింలకు తప్పుదోవ పట్టించారని కేంద్రమంత్రి దన్వే తెలిపారు. సీఏఏ అమల్లో వస్తే ఆరు నెలల్లో ముస్లింలను వెళ్లగొడతారంటూ ప్రచారం చేశారని...ఇప్పటివరకూ ఎంతమంది ముస్లింలు దేశం నుంచి వెళ్లిపోయారో చెప్పాలని ప్రశ్నించారు. ఆ విషయంలో విఫలమై..ఇప్పుడు రైతు చట్టాల విషయంలో రెచ్చగొడుతున్నారని ఆరోపించారు.
సమ్మెబాట పట్టిన రైతులతో గత కొద్దిరోజులగా కేంద్రం చర్చలు జరిపింది. చట్టాల్ని సవరించే ప్రతిపాదనను రైతులు తిరస్కరించారు. డిసెంబర్ 14 తేదీన దేశవ్యాప్తంగా నిరసనకు దిగి..జైపూర్ - ఢిల్లీ, ఢిల్లీ-ఆగ్రా రహదారుల్ని అడ్డుకుంటామని రైతు నేతలు హెచ్చరించారు. Also read: New parliament: ప్రస్తుత పార్లమెంట్ భవనంపై మోదీ ప్రశంసలు