కరోనా వైరస్ ( Coronavirus ) ఇంకా కోరలు చాస్తూనే ఉంది.  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరూ కరోనా బారిన పడుతున్నారు. ఇప్పుడు తాజాగా కేంద్రమంత్రి స్మృతి ఇరానీ ( Central minister Smriti irani tested covid positive ) కు కోవిడ్ పాజిటివ్ అని తేలింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


కోవిడ్ 19 వైరస్ బారి నుంచి ఎవరూ తప్పించుకోలేకపోతున్నారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా వైరస్ సోకుతున్న పరిస్థితులు చూస్తున్నాం. ఈ నేపధ్యంలోనే కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, రాష్ట్ర మంత్రులు అందరూ కరోనా వైరస్ బారిన పడుతున్నారు. దురదృష్టవశాత్తూ కొందరు మరణిస్తున్నారు. తాజాగా కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకు కరోనా పాజిటివ్ అని తేలింది. ప్రస్తుతం స్మృతి ఇరానీ క్వారెంటైన్ లో ఉన్నారు.


ఈ విషయాన్ని స్వయంగా ఆమె ట్వీట్ ద్వారా వెల్లడించారు. తనతో కాంటాక్ట్ లో ఉన్నవారంతో  కోవిడ్ పరీక్షలు చేయించుకోవల్సిందిగా సూచించారు.  తనకు కోవిడ్ వైరస్ సోకిందనే విషయాన్ని కాస్త వినూత్నంగానే ట్వీట్ చేసి చెప్పారామె. ఓ ప్రకటన చేసే క్రమంలో నేను పదాల కోసం వెతకడం చాలా అరుదు. అందుకే నేను చాలా సరళంగా చెబుతున్నా. నాకు కరోనా పాజిటివ్ అని తేలింది. నాతో టచ్‌లోకి వచ్చిన వారందరూ వెంటనే కరోనా పరీక్షలు చేయించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను అంటూ ట్వీట్ చేశారు.



బీహార్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ( Bihar Assembly Elections ) బీజేపీ స్టార్‌ క్యాంపెయినర్ ( Bjp Star Campaigner ) ‌గా ఉన్నారు స్మృతి ఇరానీ. గత వారమే ఆమె  బీహార్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. గోపాల్‌గంజ్‌, ముంజర్‌, బోధ్ గయా, దిఘా  ప్రాంతాల్లో మొత్తం 10 ఎన్నికల ర్యాలీల్లో పాల్గొన్నారు. ఆమెతో పాటు ప్రచారంలో పాల్గొన్న కార్యకర్తలు ఇతర నేతలిప్పుడు ఆందోళనలో ఉన్నారు. Also read: Bullet Train: ముంబై-హైదరాబాద్ మధ్య బుల్లెట్ ట్రైన్, డీపీఆర్ పై చర్చ