PM-SGMBY: సూర్యఘర్‌కు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. నెలకు 300 యూనిట్ల కరెంటు ఉచితం..
PM-SGMBY: సౌర విద్యుత్ వినియోగాన్ని ప్రోత్సాహించే `పీఎం- సూర్యఘర్` పథకానికి కేంద్రం ఆమోదం తెలిపింది. ఈ స్కీమ్ ద్వారా కోటి కుటుంబాలకు ప్రతినెలా 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు అందించనున్నారు.
PM Surya Ghar- Muft Bijli Yojana Scheme: దేశవ్యాప్తంగా కోటి ఇళ్లకు రూఫ్‌టాప్ సోలార్ సిస్టమ్‌లను ఏర్పాటు చేసే 'పీఎం-సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన' (PM-SGMBY)కు కేంద్ర కేబినెట్ గురువారం ఆమోదం తెలిపింది. ఈ పథకం ద్వారా కోటి ఇళ్లకు ప్రతినెలా 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు అందించనున్నారు. రూ.75,021 కోట్లతో రూఫ్‌టాప్ సోలార్ స్కీమ్ (Rooftop solar scheme)కు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ మీడియాకు తెలిపారు. ఈ పథకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఫిబ్రవరి 13న ప్రారంభించిన సంగతి తెలిసిందే. 2025 నాటికి అన్ని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలపై రూఫ్‌టాప్ సోలార్ వ్యవస్థను ఏర్పాటుచేయనున్నట్లు మంత్రి తెలిపారు. అందులో భాగంగా గృహ వినియోగదారుల నుంచి దరఖాస్తులు కూడా స్వీకరిస్తున్నట్లు ఆయన తెలిపారు.
ఇంటి పైకప్పుపై ఒక కిలోవాట్ సోలార్ ప్యానల్ అమర్చినట్లయితే రూ.30 వేల వరకు సబ్సిడీ పొందవచ్చు. బ్యాంకు రుణ సదుపాయం కూడా ఉంది. 2 కిలోవాట్ (kW) కలిగిన సోలార్ వ్యవస్థను అమర్చినట్లయితే.. దానికి అయిన ఖర్చులో 60% అంటే రూ. 60, 000 వరకు రాయితీనిస్తారు. 3 కిలోవాట్ల సోలార్ సిస్టమ్ అమర్చినట్లయితే 1.45 లక్షల ఖర్చు అవుతుంది. అందులో 40% అంటే 78, 000 సబ్సిడీని కేంద్రం అందించనుంది. ఇప్పటికే రూఫ్‌టాప్ సోలార్ సిస్టమ్‌లను కలిగి ఉన్న నివాస వినియోగదారులకు సబ్సిడీ వర్తించదని అధికారులు తెలిపారు. అయోధ్యలో రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ అనంతరం ప్రధాని మోదీ ఈ పథకం గురించి అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.
Also Read: New Rules: రేపటి నుంచి మారుతున్న రూల్స్ ఇవే.. తప్పకుండా తెలుసుకోండి
Also Read: SBI Recruitment 2024: ఎస్బీఐలో ఉన్నత కొలువులు, మార్చ్ 4 గడువు తేదీ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook