Centre notifies framework for traffic management of drones in lower airspace: రోజురోజుకు డ్రోన్ల వినియోగం పెరుగుతోంది. దీంతో వాటి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించాల్సిన అవసరం ఏర్పడింది. దాంతో కేంద్ర పౌర విమానయాన శాఖ డ్రోన్ల ట్రాఫిక్‌ నిర్వహణ ప్రణాళికను రూపొందిస్తూ ఆదేశాలు జారీ చేసింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వీటికి అనుగుణంగా ప్రభుత్వ, ప్రైవేటు, థర్డ్ పార్టీ సేవలు అందించే సంస్థలు విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. డ్రోన్లన్నీ (drones) వెయ్యి డుగుల ఎత్తుకు మించకుండా ఎగరాల్సి ఉన్నందున ఆ మేరకు నిబంధనలు రూపొందించింది. ప్రస్తుతం వాయు మార్గాలపై ఎయిర్‌ ట్రాఫిక్‌ మేనేజ్‌మెంట్‌ (traffic management) విధానం కొనసాగుతోంది. ఇది మానవ రహిత విమానాల నిర్వహణకు అనుకూలంగా లేకపోవడంతో కొత్త విధానాన్ని రూపొందించింది.


డ్రోన్ల కోసం అన్‌మ్యాన్డ్‌ ఎయిర్‌ క్రాఫ్ట్‌ సిస్టం (air traffic management) (ATM) ట్రాఫిక్‌ మేనేజ్‌మెంట్‌ను రూపొందించింది. దీన్ని యూటీఎంగా (Traffic Management) (UTM) పేర్కొంటున్నారు. ఈ విధానం ఆటోమేటిక్‌ ఆధారిత సాఫ్ట్‌వేర్‌ సహకారంతో పనిచేస్తుంది. ప్రైవేటు సంస్థలు రిజిస్ట్రేషన్, ఫ్లైట్‌ ప్లానింగ్, ఎగిరే డ్రోన్ల మధ్య దూరం ఉండేలా చూడడం, వాతావరణం సమాచారం తెలపడం వంటి సేవలు అందించవచ్చు. అలాగే పైలట్లతో నడుస్తున్న విమానాలు కూడా ఎక్కడ ఉన్నాయన్న సంగతినీ తెలుసుకోవచ్చు. అయితే ప్రభుత్వం ఏర్పాటు చేసే డిజిటల్‌ స్కై వ్యవస్థ (Digital‌ Sky System) ద్వారా డ్రోన్‌ నిర్వాహకులు అనుమతులు పొందాల్సి ఉంటుంది.


Also Read : Aryan Khan case: వాంఖడేపై వరుస ట్వీట్​లతో 'మహా' మంత్రి నవాబ్ మాలిక్​ సంచలన ఆరోపణలు


డ్రోన్ల (drones) ప్రయాణం విషయమై ఏర్పాటు చేసే కేంద్రానికి ప్రతి నిర్వాహకుడు కూడా సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. అది ఏ సమయంలో ఎక్కడ ఎగురుతోందన్న వాస్తవ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపిస్తుండాలి. ఈ సమాచారం నేరుగాగానీ, లేదా థర్డ్ పార్టీ ద్వారా సేవలు అందించే సంస్థ ద్వారాగానీ ఇవ్వవచ్చు. 


ఇక ఈ సేవలు అందించే సంస్థకు మొదట తక్కువ పరిధిలో ఉండే భౌగోళిక ప్రాంతాన్ని కేటాయిస్తారు. తర్వాత ఆ పరిధిని విస్తరిస్తారు.
ఈ సేవలు అందించినందుకు ఆ సంస్థలు రుసుములు వసూలు చేయవచ్చు. ఇందులో కొంతభాగాన్ని ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియాకు(Airports Authority of India) చెల్లించాల్సి ఉంటుంది.


Also Read : Ex & Current Girlfriend Fighting: ప్రేమ ఎంత మధురం.. ప్రియురా"ళ్లు" అంత కఠినం


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి