Aryan Khan case: వాంఖడేపై వరుస ట్వీట్​లతో 'మహా' మంత్రి నవాబ్ మాలిక్​ సంచలన ఆరోపణలు!

Mumbai Drugs Case: ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో వివాదం మరింత ముదురుతోంది. ఎన్​సీబీ జోనల్​ డైరెక్టర్​ సమీర్​ వాంఖడేపై మరిన్ని సంచనల ఆరోపణలు చేశారు మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్​.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Oct 27, 2021, 03:28 PM IST
  • డ్రగ్స్​ కేసుపై మహారాష్ట్ర మంత్రి సంచలన ఆరోపణలు
  • సమీర్​ వాంఖడే ఫోన్​ కాల్స్ చూడాలన్న నవాబ్ మాలిక్​
  • వాంఖడే మొదటి పెళ్లి ఫొటో అంటూ ట్వీట్​
Aryan Khan case: వాంఖడేపై వరుస ట్వీట్​లతో 'మహా' మంత్రి నవాబ్ మాలిక్​ సంచలన ఆరోపణలు!

Aryan Khan case: డ్రగ్స్ కేసులో ఆర్యన్​ ఖాన్​ అరెస్టు దగ్గరని నుంచి ఈ కేసులో కీలకంగా వ్యవహరించిన నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎస్​సీబీ) జోనల్​ డైరెక్టర్​ సమీర్​ వాంఖడే లక్ష్యంగా మరిన్ని సంచలన ఆరోపణలు చేశారు మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్​.

నకిలీ కుల ధృవీకరణతో ఉద్యోగం..

ఇప్పటికే ఇప్పటికే చేసిన ఆరోపణలు తీవ్ర చర్చకు దారి తీయగా.. బుధవారం కూడా మరోసారి ట్వీట్ల  ద్వారా సంచనల వ్యాఖ్యలు చేశారు. వాంఖడే నకిలీ కుల ధృవీకరణ పత్రాలతో ఉద్యోగం సంపాదించారని ఆరోపించారు. వాంఖడే మొదటి వివాహానికి సంబంధించింది అంటూ ఓ ఫొటోను కూడా ట్వీట్​​ చేశారు.

తాను చేసిన ట్వీట్​లు అసత్యం అని నిరూపిస్తే.. రాజకీయాల నుంచి తప్పుకుంటానని నవాబ్​ మాలిక్ సవాల్​ విసిరారు. అయితే సమీర్ వాంఖడే రాజీనామా చేయకున్నా.. చట్ట ప్రకారమే ఉద్యోగం పోతుందని చెప్పుకొచ్చారు.

Also read: Aryan Khan Drugs Case: ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో కీలక మలుపు, ఎన్సీబీ అధికారి ఢిల్లీకు

Also read: Nawab Malik On Sameer Wankhede: 'డబ్బు కోసం బాలీవుడ్​ యాక్టర్ల ఫోన్లు ట్యాప్​ చేస్తున్నారు'

అప్పుడే నిజాలు బయటపడతాయి..

వాంఖడే సహా ఆయన డ్రైవర్, ఇతర సిబ్బంది కాల్స్​ను పరిశీలించాలన్నారు. అప్పుడే ఆన్ని నిజాలు బయటపడతాయని పేర్కొన్నారు మాలిక్​. గతంలో కూడా డ్రగ్స్​ కేసులో దీపికా, శ్రద్ధాకపూర్​, సారా అలీఖాన్ వంటి స్టార్స్​ను విచారించినా ఎవరిని అరెస్టు చేయలేదన్న విషయాన్ని గుర్తు చేసుకోవాలని నవాబ్​ మాలిక్​ వివరించారు.

వాంఖడేపై ఆరోపణలు ఇలా..

బాలీవుడ్  సెలబ్రిటీల ఫోన్లను ట్యాప్ చేసి.. వారి నుంచి వాంఖడే డబ్బులు వసూలు చేస్తున్నారంటూ ఓ లేఖను కూడా ఇటీవల విడుదల చేశారు నవాబ్ మాలిక్​. ఈ ఆరోపణలపై స్పందించిన వాంఖడే.. అవి తప్పుడు ఆరోపణలని కొట్టిపారేశారు. తాను విచారణకు కూడా సిద్ధమేనని తెలిపారు. అయితే ఆరోపణలపై చట్టప్రకారంగా చర్యలు తీసుకుంటానని సమాధానమిచ్చారు.

ఆర్యన్‌ను విడుదల చేసేందుకు అతడి తండ్రి షారుక్‌ ఖాన్‌ నుంచి రూ.25 కోట్లు డిమాండ్ చేసినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

ఈ ఆరోపణలన్నింటి నేపథ్యంలో ఎన్​సీబీ విచారణకు ఆదేశించింది. డిబ్యూటీ డైరెక్టర్​ జనరల్​ సహా ఐదుగురు సభ్యులు ఈ విషయంపై విచారణ చేస్తున్నారు. ఇందుకోసం ఈ బృందం ఢిల్లీ నుంచి ముంబయికి చేరుకుంది.

ఆర్యన్ బెయిల్​పై నేడూ విచారణ..

క్రూజ్‌ నౌక డ్రగ్స్‌ కేసులో అక్టోబర్​ 3న అరెస్టయిన ఆర్యోన్​ ఖాన్​ బెయిలపై నేడు విచారణ జరగుతోంది. మంగళవారం ఈ కేసులో వాదనలు విన్న బాంబే హై కోర్టు.. విచారణను నేటికి వాయిదా వేసింది. గతంలో కూడా ఆర్యన్ బెయిల్​ కోసం దరఖాస్తు చేసుకోగా కోర్టులో చుక్కెదురైంది. ర్యన్‌ ఖాన్‌ తరఫున మాజీ అటార్నీ జనరల్‌, ప్రముఖ న్యాయవాది ముకుల్‌ రోహత్గీ వాదనలు వినిపిస్తున్నారు.

Also read: Aryan Khan Drugs Case: బాలీవుడ్‌లో వివాదం రేపుతున్న ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు

Also read: Ananya Panday : డ్రగ్స్‌ కేసులో రెండో రోజూ ఎన్సీబీ విచారణకు హాజరైన అనన్య పాండే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News