India New Strategy: సరిహద్దు రక్షణలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇక చీమ చిటుక్కుమన్నా సరే..

India New Strategy: సరిహద్దుల్లో చైనా కవ్వింపు కొనసాగుతోంది. లడాఖ్, అరుణాచల్ ప్రదేశ్‌లో చప్పుడు లేకుండా బలగాలు మోహరించడం. రోడ్లు వంతెనల నిర్మాణం ఇండియాకు ఇబ్బందిగా మారింది. ఈ నేపధ్యయంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో ఇండియా కీలక మార్పులు చేయనుంది. అవేంటో తెలుసుకుందాం.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Oct 25, 2021, 10:21 AM IST
  • చైనా సరిహద్దు కవ్వింపులకు చెక్ పెట్టేందుకు ఇండియా సరికొత్త వ్యూహం
  • సరిహద్దుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో పహరా
  • ఇక సరిహద్దుల్లో చీమ చిటుక్కుమన్నా అప్రమత్తం కాగల ఇండియా
 India New Strategy: సరిహద్దు రక్షణలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇక చీమ చిటుక్కుమన్నా సరే..

India New Strategy: సరిహద్దుల్లో చైనా కవ్వింపు కొనసాగుతోంది. లడాఖ్, అరుణాచల్ ప్రదేశ్‌లో చప్పుడు లేకుండా బలగాలు మోహరించడం. రోడ్లు వంతెనల నిర్మాణం ఇండియాకు ఇబ్బందిగా మారింది. ఈ నేపధ్యయంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో ఇండియా కీలక మార్పులు చేయనుంది. అవేంటో తెలుసుకుందాం.

ఇండియా చైనా సరిహద్దు(India China Border) అంటే నిత్యం ఘర్షణకు కేరాఫ్ అడ్రస్. సరిహద్దుల్లో నిరంతరం కవ్వింపులకు పాల్పడటం చైనాకు నిత్యకృత్యంగా మారింది. లడాఖ్, అరుణాచల్ ప్రదేశ్‌లలో రహస్యంగా బలగాల్ని మోహరించడం, రోడ్లు, వంతెనల నిర్మాణం చేపట్టడం, ఇతర నిర్మాణాలు సాగించడం అలవాటుగా మారింది. చైనా వైఖరితో ఇండియాకు ఇబ్బంది కలుగుతోంది. అందుకే చైనాను అనునిత్యం పహారా కాసేందుకు  ఇండియా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో కీలక మార్పులు చేయనుంది. ప్రమాదాన్ని అంచనా వేసేందుకు మనిషిలా ఆలోచించే సాఫ్ట్‌వేర్ 24 గంటలూ పనిచేసేలా చర్యలు చేపట్టనుంది. ఇకపై సరిహద్దుల్లో చీమ చిటుక్కుమన్నా ఇండియా అప్రమత్తమవగలదు.

చైనా, పాకిస్తాన్‌(Pakistan) శత్రుదేశాల నుంచి కాపాడుకునేందుకు భారత్‌ తన ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఒకవైపు సరిహద్దుల్లో రోడ్లు వంతెనలు, విమానాశ్రయాల వంటి మౌలిక సదుపాయాలను పెంచుకుంటూనే.. ఇంకోవైపు అత్యాధునిక టెక్నాలజీల సాయంతో శత్రువు కదలికలు పసిగట్టే ప్రయత్నాలనూ వేగవంతం చేసింది. ఇటీవలి కాలంలో చైనాతో(China)కొనసాగుతున్న సరిహద్దు సమస్యల నేపథ్యంలో దేశం తూర్పు విభాగంలో నిఘాను మరింత కట్టుదిట్టం చేసేందుకు ఏఐ అంటే కృత్రిమ మేధస్సు సాయం తీసుకుంటోంది. వాస్తవాదీన రేఖ వెంబడి నిఘా పెట్టేందుకు మానవరహిత విమానాలు, రాడార్లు అమర్చిన హెలికాప్టర్లు ఇప్పటికే పని చేస్తున్నాయి. వీటితోపాటు ఉపగ్రహాల నుంచి అందే ఛాయాచిత్రాలు, నేలపై వేర్వేరు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సెన్సర్లు అన్నీ ఎప్పటికప్పుడు చైనా సైన్యం కదలికలకు సంబంధించిన సమాచారాన్ని అందిస్తున్నాయి. కృత్రిమమేధస్సు (Artificial Intelligence)సాయంతో వీడియోలను, ఛాయాచిత్రాలను కలిపి కదలికలను స్పష్టంగా గుర్తిస్తున్నారు.

చైనా సైన్యంలో ఎంత మంది ఉన్నారు? ఏ రకమైన వాహనాలు వాడుతున్నారు? సరిహద్దుల(China Border)వెంబడి ఎలాంటి మౌలిక సదుపాయాల నిర్మాణం జరిగిందన్న సమాచారం ఎప్పటికప్పుడు తెలుస్తోంది. వీటి ఆధారంగా చైనా దూకుడుకు కళ్లెం వేసే అవకాశం లభిస్తోంది. ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. సరిహద్దుకు అవతల సైనికుల రవాణా జరగుతోందా? లేక గొర్రెలు, ఆవుల్లాంటి జంతువులు కదులుతున్నాయా? అనేది కూడా కృత్రిమ మేధస్సు సహాయంతో పనిచేసే నిఘా సాఫ్ట్‌వేర్‌ ఉపయోగపడుతుంది. భవిష్యత్తు యుద్ధాలన్నీ సైబర్‌ యుద్ధాలే అనే అంచనా నిజమవుతున్న నేపధ్యంలో డీఆర్డీవో(DRDO) ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్‌ వంటి అత్యాధునిక టెక్నాలజీలను అన్ని స్థాయిల్లో వాడేందుకు రంగం సిద్ధం చేస్తోంది. యుద్ధరంగంలో కృత్రిమ మేధస్సు ఆధారిత ఆయుధ వ్యవస్థలను దింపడం చాలా సులభం కానుంది. ఇదంతా జరిగేందుకు కేవలం మూడు నాలుగేళ్లు సరిపోతుందని చెబుతున్నారు మిలటరీ నిపుణులు.  డీఆర్‌డీవోకు చెందిన సెంటర్‌ ఫర్‌ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ రోబోటిక్స్‌ దాదాపు 150 మంది ఇంజినీర్ల సాయంతో ఏఐ రోబోటిక్స్, నియంత్రణ వ్యవస్థల ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తోంది. శత్రువులకు చిక్కకుండా రహస్యంగా సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకునేందుకు అవసరమైన నెట్‌వర్క్‌లూ ఇందులో ఉన్నాయి.  

Also read: China new land border law: చైనా కొత్త ఎత్తుగడ, నూతన సరిహద్దు చట్టం అమలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News