H3N2 Cases: పెరుగుతున్న హెచ్3ఎన్2 కేసులు.. రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం హెచ్చరికలు
Influenza Virus: కరోనా మహమ్మారి నుంచి పూర్తిగా కోలుకుంటున్న తరుణంలో మరో వైరస్ పంజా విసిరేందుకు రెడీ అవుతోంది. ఏ మాత్రం అలసత్వం వహించినా ప్రాణాలకే ముప్పువాటిల్లే అవకాశం ఉంది. ఈ నేపథ్యంనే కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమై రాష్ట్ర ప్రభుత్వలకు హెచ్చరికలు జారీ చేసింది.
Influenza Virus: సీజనల్ ఇన్‌ఫ్లుయెంజా సబ్‌టైప్ హెచ్3ఎన్2 కేసుల పెరుగుదల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయింది. రాష్ట్ర ప్రభుత్వాలు ఏ మాత్రం నిర్లక్ష్యం చేయవద్దని హెచ్చరించింది. ఇన్‌ఫ్లుయెంజా వంటి అనారోగ్యం లేదా తీవ్రమైన అక్యూట్ రెస్పిరేటరీ ఇన్‌ఫెక్షన్ కేసులపై నిఘా కోసం మార్గదర్శకాలను అనుసరించాలని సూచించింది. కోవిడ్-19, ఇన్‌ఫ్లుఎంజాకు వ్యతిరేకంగా టీకా కవరేజ్, ఆసుపత్రులలో మందులు, ఆక్సిజన్ అందుబాటులో ఉంచుకోవాలని పేర్కొంది. కరోనా మహమ్మారి తరువాత హాంకాంగ్ ఫ్లూగా పిలుస్తున్న ఇన్‌ఫ్లుయెంజా వైరస్ కేసులు పెరుగుతుండడంతో ఆందోళన మొదలైంది.
ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం శనివారం లేఖ రాసింది. కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్ మాట్లాడుతూ.. గత కొన్ని నెలలుగా కోవిడ్-19 కేసులు భారీగా తగ్గిపోయినా.. మళ్లీ కరోనా పరీక్ష పాజిటివిటీ రేటు క్రమంగా పెరుగుతోందన్నారు. ఇది ఆందోళన కలిగించే అంశం అని.. రాష్ట్రాలు తక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అప్రమత్తంగా ఉండటంతోపాటు టెస్ట్, ట్రాక్, ట్రీట్ నీడ్ అనే ఐదు రెట్లు వ్యూహంపై దృష్టి సారించామన్నారు.
ప్రస్తుత సీజన్‌లో ఇన్‌ఫ్లుయెంజా వైరస్ వాతావరణ పరిస్థితుల్లో మార్పుల కారణంగా ప్రబలుతోంది. వ్యక్తిగత పరిశుభ్రతపై తగిన శ్రద్ధ లేకపోవడం.. ఇంటికే పరిమితం కావడంతో వ్యాధుల బారిన పడుతున్నారు. ఇన్‌ఫ్లుయెంజా, అడెనోవైరస్‌లు వంటి అనేక వైరల్ శ్వాసకోశ వ్యాధికారక వ్యాప్తికి కారణమవుతున్నాయి. వివిధ ప్రయోగశాలలలో విశ్లేషిస్తున్న నమూనాలలో ఇన్‌ఫ్లుయెంజా ఏ (హెచ్3ఎన్2) ప్రాబల్యంఆందోళన కలిగిస్తోంది. హెచ్1ఎన్1, హెచ్3ఎన్2, అడెనోవైరస్ మొదలైనవాటికి చిన్న పిల్లలు, వృద్ధులు, అనారోగ్యంతో ఉన్న వ్యక్తులు త్వరగా ప్రభావితం అవుతున్నారు.
ఈ వ్యాధి సోకినవారిలో జ్వరం, వణుకు, దగ్గు, శ్వాస ఇబ్బంది, శ్వాస తీసుకునేటప్పుడు శబ్దాలు వంటి లక్షణాలు కనిస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు. వీటితో పాటు వాంతులు వచ్చినట్లు ఉండటం.. గొంతు నొప్పి, ఒళ్లు నొప్పులు, డయేరియా లక్షణాలు కూడా ఉంటున్నాయన్నారు. ఈ లక్షణాలు వారానికి పైగా ఉంటే కచ్చితంగా అనుమానించాల్సిందేనంటున్నారు. కేసుల పెరుగుదల ఆందోళన కలిగిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది.
Also Read: MLC Kavitha: ఊహగానాలకు చెక్.. ముగిసిన ఎమ్మెల్సీ కవిత విచారణ
Also Read: Pawan Kalyan: అదే జరిగిఉంటే నేను ఓడిపోయేవాడిని కాదు.. సగానికిపై వాళ్ల ఓట్లే వచ్చాయి: పవన్ కళ్యాణ్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook