Pawan Kalyan: అదే జరిగిఉంటే నేను ఓడిపోయేవాడిని కాదు.. సగానికిపై వాళ్ల ఓట్లే వచ్చాయి: పవన్ కళ్యాణ్‌

Pawan Kalyan On Caste Politics:  తనను రాజకీయంగా విమర్శించాలంటే బీసీలు, దళితులతో తిట్టిస్తున్నారని పవన్ కళ్యాణ్‌ అన్నారు. బీసీలు నేటికీ దేహీ అనే స్థితిలో ఉండడం బాధకరమన్నారు. బీసీలు హక్కుల కంటే ముందు ఐక్యత సాధించాలని అన్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 11, 2023, 10:15 PM IST
  • జీసీలు ఆశించే స్థాయి మంచి శాసించే స్థాయికి ఎదగాలి
  • జనసేన గెలుపు... బీసీల గెలుపు
  • ఆర్థిక పరిపుష్టితోనే రాజకీయ సాధికారిత సిద్ధిస్తుంది: పవన్‌ కళ్యాణ్‌
Pawan Kalyan: అదే జరిగిఉంటే నేను ఓడిపోయేవాడిని కాదు.. సగానికిపై వాళ్ల ఓట్లే వచ్చాయి: పవన్ కళ్యాణ్‌

Pawan Kalyan On Caste Politics: బీసీలంటే బ్యాక్‌ వర్డ్‌ క్లాస్‌ కాదు.. బ్యాక్‌ బోన్‌ క్లాస్‌ అని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ అన్నారు. బీసీలు ఆశించే స్థాయి నుంచి శాసించే స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. బీసీలు తమ హక్కుల కన్నా ముందు ఐక్యత సాధించాలని, ఆర్థిక పరిపుష్టి సాధించిన రోజున రాజ్యాధికారం తప్పక సిద్ధిస్తుందని అన్నారు. బీసీలకు ఆర్థిక పరిపుష్టి, రాజ్యాధికార సాధన కోసం జనసేన కృషి చేస్తుందని హామీ ఇచ్చారు. శనివారం మంగళగిరి పార్టీ కార్యాలయంలో బీసీ సంక్షేమంపై రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. "బీసీ కులాలు అంటే ఉత్పత్తి కులాలు. భారతదేశ సంస్కృతికి వెన్నెముక. అత్యధిక సంఖ్యా బలం ఉండి కూడా నేటికీ దేహీ అనే స్థితిలో ఉండటం బాధాకరం. అత్యధిక బీసీలు ఉన్న చోట మిగతా కులాలకు చెందిన వ్యక్తులు గెలుస్తున్నారు. బీసీల అనైక్యతే మిగతా వారికి బలం. బీసీలు హక్కుల కంటే ముందు ఐక్యత సాధించాలి. బీసీలకు సాధికారత రావాలంటూ ఇంత వరకు మాటలు చెప్పే నాయకులనే మీరు చూశారు. చేతలను చూపించే నాయకత్వాన్ని నేను చూపిస్తాను.

నన్ను రాజకీయంగా విమర్శించాలంటే బీసీలు, దళితులతో తిట్టిస్తారు. ఎందుకంటే క్షేత్రస్థాయిలో బీసీలు, కాపులు, దళితులు కొట్టుకోవాలని అలా చేస్తారు. ఈ పన్నాగం పన్నిన నాయకులు మాత్రం ఏ పార్టీలో ఉన్నా తిట్టుకోరు. విమర్శించుకోవడం కూడా చాలా చక్కగా విమర్శించుకుంటారు. తెలంగాణలో 26 బీసీ కులాలను బీసీ స్టేటస్‌ నుంచి తొలగించారు. అప్పుడు ఎందుకు బీసీలు
ఉద్యమించలేదు..? ఒక్క బీసీ నాయకుడైనా దీనిపై మాట్లాడారా..? ఆ రోజు బలంగా మాట్లాడింది కేవలం జనసేన పార్టీ మాత్రమే. 

56 బీసీ కార్పొరేషన్ల పదవులు స్టిక్కర్లకే పరిమితమయ్యాయి. 36 మంది టీటీడీ సభ్యులు ఉంటే అందులో ముగ్గురు బీసీలకు మాత్రమే చోటు కల్పించారు. జనసేన పార్టీ అధికారంలోకి వస్తే టీటీడీ సభ్యుల్లో సగం మందిని బీసీలతో నింపుతాం. బీసీ సబ్‌ ప్లాన్‌ నిధులను ఒక్క రూపాయి కూడా దారి మళ్లించకుండా అట్టడుగు వ్యక్తికి చేరేలా కృషి చేస్తాం. బీసీలు రెండు కోట్ల మంది ఉంటే 4.37 లక్షల మందికి ఏడాదికి రూ. 10 వేలు ఇచ్చి వాళ్ల భవిష్యత్తను కొనేస్తున్నారు. జీవో నెం 217 తీసుకొచ్చి మత్స్యకారుల కడుపుకొట్టారు. మనకు న్యాయం చేయని జీవో చిత్తుకాగితంతో సమానమని ఆ రోజు ఆ జీవోను చింపేశాను. రూ. 20 కోట్లు పెట్టి మత్స్యకారులకు జెట్టీలు ఏర్పాటు చేస్తే వలసలను నిరోదించవచ్చు. దీనిపై ఎవరూ ఆలోచన చేయరు. దాదాపు 400 బ్యాక్‌ లాగ్‌ పోస్టులు ఖాళీగా ఉండిపోయాయి. బీసీలు గనుక ఉద్యమిస్తాను అంటే నేను అండగా ఉంటాను. ఎక్కడికి రమ్మన్నా అక్కడికి వచ్చి ఒక రోజు దీక్షకు కూర్చుంటాను.." అని అన్నారు.

తాను ఏ ఒక్క కులానికి చెందిన నాయకుడిని కాదని.. అన్ని కులాలకు చెందిన నాయకుడినని అన్నారు పవన్ కళ్యాణ్‌. తూర్పుగోదావరి జిల్లాలో కాపులకు, శెట్టిబలిజలకు పడదన్నారు. 2 వారాలు అక్కడ కూర్చొని సయోధ్య చేశానని.. దాని ఫలితంగా శెట్టిబలిజల పండగకు కాపులు శుభాకాంక్షలు చెప్పే పరిస్థితి మారిందని అన్నారు. నిజంగా తనను కాపులు ఓన్‌ చేసుకొని ఉంటే ఓడిపోయేవాడిని కాదన్నారు. గోదావరి జిల్లాల్లో జనసేన పార్టీకి వచ్చిన ఓట్లలో సగానికి పైగా బీసీలు వేసినవేనని చెప్పారు. వైసీపీ, టీడీపీ నాయకులు ఆర్థికంగా పరిపుష్టిగా ఉంటారు కనుకే వాళ్లు బలంగా ఆటలాడుతారంటూ విమర్శించారు. బీసీల గెలుపు జనసేన గెలుపు అని.. వాళ్లను అధికారంలోకి తీసుకువచ్చేందుకు పరితపిస్తున్నానంటూ చెప్పుకొచ్చారు జనసేనాని.

Also Read: MLC Kavitha: ఊహగానాలకు చెక్.. ముగిసిన ఎమ్మెల్సీ కవిత విచారణ  

Also Read: Shubman Gill: శుభ్‌మన్ గిల్ సెంచరీ.. కేఎల్ రాహుల్ సర్దుకోవాల్సిందేనా..!  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x