First Omicron variant Case in Chandigarh: దేశంలో కరోనా ఒమిక్రాన్ కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా చండీగఢ్‌లో తొలి ఒమిక్రాన్ కేసు (First case of Omicron in Chandigarh) నమోదైంది. ఈ విషయాన్ని చండీగఢ్‌ ఆరోగ్య విభాగం అధికారికంగా ప్రకటించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

డిసెంబర్ 1న గుర్తింపు కానీ..


ఇటలీ నుంచి వచ్చిన 20 ఏళ్ల యువకుడికి ఒమిక్రాన్ నిర్ధారణ అయినట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది. నిజానికి ఆ వ్యక్తి ఇటలి నుంచి నవంబర్​ 22న ఇండియాకు వచ్చాడు. డిసెంబర్ 1న అతడికి ఆర్​టీపీసీఆర్ టెస్టులో పాజిటివ్​గా తేలినట్లు పేర్కొది ఆరోగ్య శాఖ. తాజాగా చేసిన పరీక్షల్లో అతనికి సోకింది ఒమిక్రాన్ వేరియంట్​గా గుర్తించినట్లు తెలిపింది.


అయితే ఆ వ్యక్తి రెండు డోసులు ఫైజర్ టీకా (Pfizer vaccine) వేసుకున్నాడని.. అయినప్పటికీ పాజిటివ్​గా తేలినట్లు వివరించింది ఆరోగ్య శాఖ. 


మరో వైపు ఆంధ్రప్రదేశ్​లో కూడా తొలి ఒమిక్రాన్ కేసు నమోదైంది. విదేశీల నుంచి వచ్చిన ఓ 35 వ్యక్తిలో ఈ వేరియంట్​ను గుర్తించినట్లు రాష్ట్ర ప్రభుత్వం (First Omicron case in AP) వెల్లడించింది.


తాజా కేసులతో దేశవ్యాప్తంగా ఒమిక్రాన్ పాజిటివ్​ వచ్చిన వారి సంఖ్య 35కు (Total Omicron cases in India) చేరింది. ఇందులో మహారాష్ట్ర (17) తొలిస్థానంలో ఉండగా, రాజస్థాన్ (9) రెండో స్థానంలో నిలిచింది. ఆ తర్వాత గుజరాత్ (3)​, కర్ణాటక (2), ఢిల్లీ (2) ఉన్నాయి.


దేశంలో తగ్గుతున్న కొవిడ్ కేసులు..


ఇదిలా ఉండగా.. దేశంలో కరోనా కేసుల సంఖ్య మాత్రం తగ్గుతూ వస్తోంది. వరుసగా రెండో రోజూ 8 వేల దిగువన కొత్త కేసులు నమోదయ్యాయి. తాజాగా 7,774 మందికి కొవిడ్ సోకినట్లు (Corona cases in India) కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. యాక్టివ్ కేసులు (Active corona cases in India) 92,281 వద్దకు చేరాయి.


Also read: Night Curfew: 'రాత్రి పూట కర్ఫ్యూని పరిశీలించండి.. కఠిన నిబంధనలు విధించండి'


Also read: Covid Cases in India: దేశంలో కొత్తగా 7,774 కొవిడ్ కేసులు, 306 మరణాలు.. 33 ఒమిక్రాన్ కేసులు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook