Night Curfew: 'రాత్రి పూట కర్ఫ్యూని పరిశీలించండి.. కఠిన నిబంధనలు విధించండి'

Night Curfew: కొవిడ్ పరిణామాలపై రాష్ట్రాలకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ లేఖలు రాసింది. కొవిడ్ కట్టడికి కఠిన నిబంధనలు పాటించాలని సూచించింది.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Dec 11, 2021, 06:11 PM IST
  • ఒమిక్రాన్ భయాలతో రాష్ట్రాలకు కేంద్రం లేఖలు
  • రాష్ట్రాలు కఠిన నిబంధనలు పాటించాలని వెల్లడి
  • రాత్రిపూట కర్ఫ్యూ పరిశీలించాలని సూచన
Night Curfew: 'రాత్రి పూట కర్ఫ్యూని పరిశీలించండి.. కఠిన నిబంధనలు విధించండి'

Night Curfew: దేశవ్యాప్తంగా కరోనా ఒమిక్రాన్ వేరియంట్ భయాలు (Omicron scare) ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలకు కీలక సూచనలు చేసింది. అవసరమైతే రాత్రి పూట కర్ఫ్యూ (Centre Suggests Night Curfew) విధించే అంశాన్ని పరిశీలించాలని సూచించింది.

దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులకు కేంద్రం తాజాగా లేఖలు రాసిది. 10 రాష్ట్రాల్లోని 27 జిల్లాలో కొవిడ్ పాజిటివిటి రేటు గత రెండు వారాల్లో పెరుగుతూ వస్తున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్​ పేర్కొన్నారు. ఈ విషయాన్ని పరిగణించి తగిన జాగ్రత్తలు (COVID rules) తీసుకోవాలని తెలిపారు.

'ఇటీవలి కాలంలో కరోనా కేసుల సంఖ్య భారీగా తగ్గింది. మహమ్మారిపై పోరాటంలో ప్రస్తుతం మన క్లిష్టమైన దశలో ఉన్నాం. మూడు రాష్ట్రాల్లోని 10 జిల్లాలో గత రెండు వారాల్లో 10 శాతం కన్నా ఎక్కువ పాజిటివిటీ రేటు నమోదైంది. ఇదే సమయంలో ఏడు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో పాజిటివిటr రేటు 5 నుంచి 10 శాతం మధ్య నమోదైనట్లు తెలుస్తోంది. ఆయా జిల్లాల్లో కొవిడ్ నియంత్రణకు ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.' అని రాజేశ్ భూషణ్​ పేర్కొన్నారు.

10 శాతం కన్నా పాజిటివ్​ రేటు ఉంటే చర్యలు..

'ఆక్సిజన్ సపోర్ట్​ బెడ్​లపై 10 శాతం కన్నా ఎక్కువ లేదా సాధారణ బెడ్​లలో 60 శాతం అక్యుపెన్సీ గుర్తించిన జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారించాలి. వ్యూహాత్మక నియంత్రణ చర్యలు చెపట్టాలి. అవసరమైతే రాత్రిపూట కర్ఫ్యూ విధించాలి' అని కేంద్రం రాష్ట్రాలకు సూచనలు చేసిది.

టెస్టులు పెంచాలి..

కొవిడ్​ టెస్టులు, కరోనా నిర్దారణ అయిన వారిపై నిఘాను పెంచాలని కేంద్రం రాష్ట్రాలకు స్పష్టం చేసింది. వ్యాక్సినేషన్​ ప్రక్రియను వేగవంతం చేయాలని తెలిపింది. కొవిడ్ నియంత్రణ కోసం కఠిన నిబంధనలు పాటించాలని కూడా సూచించింది.

ఇప్పటి వరకు దేశంలో దేశంలో 33 ఒమిక్రాన్ కేసులు (Omicron cases in India) వెలుగు చూశాయి. అందులో 17 మహారాష్ట్రలో ఉండగా.. రాజస్థాన్​లో 9, గుజరాత్​లో 3, కర్ణాటక, ఢిల్లీలో రెండు చొప్పున కేసులు నమోదయ్యాయి.

ఒమిక్రాన్ భయాలతో ఇప్పటికే పలు రాష్ట్రాలు కఠిన నిబంధనలు కూడా అమలు చేస్తున్నాయి.

Also read: Omicron: ఢిల్లీలో రెండో ఒమిక్రాన్‌ కేసు.. భయాందోళనలో ప్రజలు! దేశంలో ఎన్ని కేసులు ఉన్నాయో తెలుసా?

Also read: Corona cases in India: దేశంలో తగ్గిన కరోనా ఉధృతి- 559 రోజుల కనిష్ఠానికి యాక్టివ్ కేసులు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News