Dauther In Laws Success Story: నారా బ్రహ్మణి.. తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు తెలిసిన వారికి పరిచయం చేయక్కర్లేని పేరు. నందమూరి వారి కూతురుగా.. నారా వారి కోడలిగా అందరికీ సుపరిచితురాలు. హీరో నందమూరి బాలకృష్ణ ముద్దుల తనయ అయిన బ్రహ్మణి.. లోకేశ్‌ను వివాహ మాడి నారా వారి కుటుంబంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడిని స్కిల్‌ స్కామ్  కేసులో అప్పటి జగన్ ప్రభుత్వం అరెస్టు చేశాకా.. టీడీపీ పరిస్థితి దారుణంగా తయారైంది. అలాంటి సమయంలో అత్త భువనేశ్వరికి తోడుగా బ్రహ్మణి ఎంతగానో పోరాడారు. మామ చంద్రబాబు బెయిల్‌పై బయటకు వచ్చే వరకు అండగా ఉంటూ తన వంతు పాత్ర పోషించారు. ఆ తర్వాత చంద్రబాబును గెలిపించాలంటూ రాష్ట్రంలో పలు చోట్ల పర్యటించి అప్పటి ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ప్రచారం చేశారు. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Nara Lokesh: 'అంతఃకరణ శుద్ధి' పలకలేని నారా లోకేశ్‌.. నిప్పు అనుకుంటే మళ్లీ పప్పేనా?


 


మామ చంద్రబాబుతో పాటు భర్త లోకేశ్‌ తరుపున బ్రహ్మణి ప్రచారం చేశారు. మంగళగిరిలో ఇంటి ఇంటికీ తిరిగి తన భర్తకు ఓటేయాలంటూ కోరారు. టీడీపీ అధికారంలో వస్తే చేసే సంక్షేమ పథకాలను ప్రచారం చేశారు. అంతవరకు రాజకీయాలకు అంటీ ముట్టనట్లు ఉన్న బ్రహ్మణి పూర్తి స్థాయిలో ప్రచారం చేసి.. లోకేశ్‌ భారీ మెజారిటీతో గెలిచేందుకు కారణమయ్యారు. తద్వారా టీడీపీ విజయంతో కీలక పాత్ర పోషించారు. చంద్రబాబు అరెస్ట్ సమయంలోనూ బ్రహ్మిణి సోషల్ మీడియాలో వరుస ట్వీట్లతో ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. అప్పటి నుంచి రాజకీయంగా ఆమె మరింత యాక్టివ్ అయ్యారు.

Also Read: YS Jagan: శాసనమమండలినే జగన్‌ అడ్డా.. చంద్రబాబుపై పోరాడుదామంటూ ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం


 


పులివర్తి త్రిషా రెడ్డి
ఇక టీడీపీ అధినేత చంద్రబాబు ప్రమాణ స్వీకారంలో సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్‌గా నిలిచారు డాక్టర్ పులివర్తి త్రిషా రెడ్డి. తెలుగుదేశం పార్టీకి చెందిన చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని కోడలే డాక్టర్ త్రిషారెడ్డి. తన మామ పులివర్తి నాని, అత్తా సుధారెడ్డి, భర్తతో కలిసి త్రిషారెడ్డి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఎమ్మెల్యేలు, వారి కుటుంబ సభ్యులకు కేటాయించిన చోట కూర్చున్నారు. 


కమ్మ సామాజిక వర్గానికి చెందిన పులివర్తి నానిది ప్రేమ పెళ్లి. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన సుధారెడ్డిని ఆయన ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆయన కుమారుడు కూడా డాక్టర్ త్రిషా రెడ్డిని లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. తన మామ నాని గెలుపు కోసం త్రిషారెడ్డి కృషి చేశారు. అప్పట్లో ఆమె విడుదల చేసిన వీడియో నెట్టింట బాగా వైరల్ అయింది. తనకు రాజకీయాలంటే పెద్దగా తెలియదని.. ప్రజల కోసం తన మామ పులివర్తి నాని ఎంతో కష్టపడుతున్నారని చెప్పారు. ఆయనను గెలిపించాలని కోరారు. 


ప్రీతిరెడ్డి
ఆంధ్రప్రదేశ్‌లో నారా బ్రహ్మణి, పులివర్తి త్రిషారెడ్డి.. తరహాలో తెలంగాణలో మాజీ మంత్రి మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి టాక్ ఆఫ్‌ ది టౌన్‌గా మారారు. తన మామ అప్పటి మంత్రి మల్లారెడ్డి కోసం ఆమె విస్తృతంగా ప్రచారం చేశారు. అంతే కాదు కాంగ్రెస్ నేతలు ఒకానొక దశలో ఆమెతో ఘర్షణకు కూడా దిగారు. అయినా ఎలాంటి బెదురు లేకుండా మామ గెలుపు కోసం చివరి దాకా పోరాడారు. మల్లారెడ్డి విజయంలో కీలక పాత్ర పోషించారు. ఒక వైపు తమ కళాశాలల బాధ్యతలు నిర్వర్తిస్తూనే ప్రీతిరెడ్డి…ఎన్నికల ప్రచారాల్లో పాల్గొనడం విశేషం.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter