Deadline Dates and Works: ఇన్‌కంటాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయడం, పీఎఫ్ ఎక్కౌంట్లో నామినీని చేర్చడం చేశారా లేదా. ఒకవేళ చేయకపోతే ఈనెలాఖరులోగా తప్పకుండా చేయాలి. ఇవి కాకుండా ఈ నెలాఖరులోగా చాలా ముఖ్యమైన పనులు చేయాల్సి ఉంది. అవేంటో పరిశీలిద్దాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

2021 సంవత్సరం చివరి నెల డిసెంబర్ మరి కొద్దిరోజుల్లో ముగియనుంది. ఈ నెలాఖరులోగా చాలా ముఖ్యమైన పనులు కొన్ని పూర్తి చేయాల్సి ఉంటుంది. ఒకవేళ నిర్ణీత గడువులోగా మీ పనులు పూర్తి చేయకపోతే నష్టం చవిచూడాల్సి వస్తుంది. ఒకవేళ మీరు ఇప్పటి వరకూ ఇన్‌కంటాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసుండకపోతే..డిసెంబర్ 31లోగా తప్పకుండా చేయండి. అటు ఈపీఎఫ్ఓ కూడా పీఎఫ్ ఎక్కౌంట్‌లో నామినీని చేర్చేందుకు ఈ నెలాఖరు చివరితేదీగా పేర్కొంది. ఇంకా ఏయే ఇతర పనులున్నాయో చూద్దాం.


2020-21 ఆర్ధిక సంవత్సరం నిమిత్తం ఇన్‌కంటాక్స్ రిటర్న్స్ ఫైల్(ITR Filing)చేసేందుకు డిసెంబర్ 31 చివరి తేదీ. ట్యాక్స్ నిపుణులు చెప్పిందాని ప్రకారం గడువు తేదీలోగా ఫైల్ చేస్తే కేవలం పెనాల్టీ నుంచి మినహాయింపు మాత్రమే కాకుండా ఇంకా ఇతర ఉపయోగాలు కూడా ఉంటాయి. భారీ జరిమానా నుంచి తప్పించుకోవచ్చు. నోటీసు భయం కూడా ఉండదు. 


పీఎఫ్ ఎక్కౌంట్‌లో నామినీ చేర్చడం


ఈపీఎప్ఓ అందరు ఖాతాదారులకు నామినీని చేర్చాలని విజ్ఞప్తి చేసింది. నామినీ చేర్చేందుకు డిసెంబర్ 31 చివరితేదీగా పేర్కొంది. ఒకవేళ మీరు మీ పీఎఫ్ ఎక్కౌంట్‌లో (PF Account)నామినీని డిసెంబర్ 31 లోగా చేర్చకపోతే చాలా ఇబ్బందులు ఎదుర్కోవల్సి వస్తుంది. ఈపీఎఫ్ఓ(EPFO)సైట్ ద్వారా చాలా సులభంగా ఆన్‌లైన్ ద్వారా ఈ పని పూర్తి చేయవచ్చు. వాస్తవానికి ఈ నిబంధన ఎందుకంటే..నామినేషన్ చేర్చితే ఈపీఎఫ్ సభ్యుడు ఒకవేళ మరణిస్తే సులభంగా పీఎఫ్ డబ్బులు , ఎంప్లాయ్ పెన్షన్ స్కీమ్, ఎంప్లాయ్ డిపాజిట్ రిఫండ్ ఇన్సూరెన్స్ స్కీమ్‌‌ల ప్రయోజనాలు చేకూరుతాయి. 


ఆడిట్ రిపోర్ట్ సమర్పణ


ఈ నెలాఖరులోగా ఆడిట్ రిపోర్ట్ కూడా సమర్పించాల్సి వస్తుంది. వ్యాపారులకు ఇది తప్పనిసరి. ఏడాది సంపాదన పదికోట్ల కంటే ఎక్కువుంటే ఇన్‌కంటాక్స్ రిటర్న్స్‌తో పాటు ఆడిట్ రిపోర్ట్ కూడా సమర్పించాల్సి ఉంది. ఆర్కిటెక్ట్, ఇంజనీర్, డాక్టర్, యాక్టర్, లాయర్, టెక్నీషియన్స్ వంటి వృత్తుల్లో ఉన్నవారైతే ఏడాదికి 50 లక్షల ఆదాయం దాటితే ఆడిట్ రిపోర్ట్ సమర్పించాల్సి ఉంటుంది. దీనికి డిసెంబర్ 31 చివరి తేదీ. అటు బ్యాంక్ ఆఫ్ బరోడా తక్కువ వడ్డీకు అంటే 6.5 శాతం వడ్డీకు హోమ్‌లోన్ ఇస్తోంది. ఈ కొత్త వడ్డీరేటు పొందాలనుకుంటే డిసెంబర్ 31లోగా దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది. 


Also read: Omicron in Noida: దేశంలో మరో 5 Omicron కేసులు.. 62కు పెరిగిన ఒమిక్రాన్ కేసుల సంఖ్య


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook