Omicron in Noida: దేశంలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ (omicron cases in india) కలకలం సృష్టిస్తోంది. ఇటీవలే యునైటెడ్ కింగ్ డమ్ నుంచి నోయిడాకు తిరిగి వచ్చిన గౌతమ్ బుద్ నగర్ కు చెందిన ఐదుగురు ఒమిక్రాన్ (Omicron in Noida) బారిన పడినట్లు అధికారులు ప్రకటించారు. ఈ విషయాన్ని చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సునీల్ శర్మ స్పష్టం చేశారు.
"ఒమిక్రాన్ బారిన పడిన దేశాలైన యునైటెడ్ కింగ్ డమ్, సింగపూర్ నుంచి వచ్చిన ఐదురుగు పౌరులకు కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ నిర్ధారణ అయ్యింది. వారందరిని ప్రస్తుతం క్వారంటైన్ కు తరలించాం" అని డాక్టర్ సునీల్ శర్మ వెల్లడించారు.
నోయిడాలోని గౌతమ్ బుద్ధ నగర్ కు చెందిన 4,729 మంది విదేశాల నుంచి తిరిగి వచ్చినట్లు ఆరోగ్య అధికారులు గుర్తించారు. అందులో 1,101 మంది ఒమిక్రాన్ రెడ్ లిస్టు దేశాల నుంచి వచ్చారని పేర్కొన్నారు.
కొత్త కేసులతో దేశంలోని ఒమిక్రాన్ కేసులు సంఖ్య మొత్తం 62కి చేరింది. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను అప్రమత్తం చేస్తున్నాయి. మహారాష్ట్ర, రాజస్థాన్ , కర్ణాటక, గుజరాత్, కేరళ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతో పాటు.. ఢిల్లీ, చంఢీగఢ్‌లో ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి.
మరోవైపు ప్రపంచవ్యాప్తంగా 63 దేశాలకు ఒమిక్రాన్ వేరియంట్ (omicron cases in india) విస్తరించినట్లు డబ్ల్యూహెచ్ఓ తెలిపింది. ఇది డెల్టా వేరియంట్‌ను త్వరలోనే అధిగమించేలా ఉందని అభిప్రాయపడింది. అయితే ఒమిక్రాన్‌పై వ్యాక్సిన్ పనితీరుకు సంబంధించి సరైన ఆధారాలు లేవని పేర్కొంది.
ALso Read: Assam tea : వేలంలో కిలో రూ.99,999 ధర పలికిన అస్సాం తేయాకు, ఆ టీ అమోఘమట
Also Read: Rajnath Singh: 1971 నాటి యుద్ధ వీరుడి భార్య పాదాలకు నమస్కరించిన రాజ్‌నాథ్ సింగ్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook