అక్రమంగా తరలించాలనే ఉద్దేశ్యముంటే...మార్గాలు చాలానే ఉంటాయి. కొరియర్ పార్శిల్ ద్వారా కూడా విదేశీ కరెన్సీ ( Foreign currency ) ను సరిహద్దులు దాటించవచ్చా...ప్రయత్నమైతే చేశారు కానీ పట్టుబడిపోయారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


విదేశాల్నించి బంగారం ( Gold & silver ) ఇతర వస్తువుల్ని రకరకాలుగా దాచిపెట్టి దేశానికి రప్పించడం చూశాం. సరిహద్దులు దాటించడం చూశాం. ఇప్పుడు ఇంకాస్త భిన్నంగా ఆలోచించినట్టున్నాడు ఆ ప్రబుద్ధుడు. విదేశీ కరెన్సీను ఇండియా నుంచి పంపిస్తూ అడ్డంగా దొరికిపోయాడు. అది కూడా ఎలాగో తెలుసా..వింటే ఆశ్చర్యపోతారు. ప్రత్యేకంగా మౌల్డ్ చేసిన 25 చిన్న చిన్న స్టీల్ ప్లేట్లలో విదేశీ కరెన్సీని అమర్చాడు.  40 వేల జీబీపీలు ( 40 thousand GBP ). అంటే ఇండియన్ రూపీస్ లో 38 లక్షల 64 వేల రూపాయలు. ఇలా అమర్చినదాన్నికొరియర్ పార్శిల్ ద్వారా సింగపూర్ ( Singapore ) కు తరలించాలనుకున్నారు. చెన్నై ఎయిర్ పోర్ట్ ( Chennai airport ) లో కస్టమ్స్ శాఖకు అడ్డంగా దొరికేసింది ఈ పార్శిల్. కస్టమ్స్ చట్టం ఫెమా ( FEMA ) కింద ఈ పార్శిల్ ను సీజ్ చేశారు. పార్శిల్ చేసిన వ్యక్తిని అరెస్టు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.