Heavy Rains in Chennai: భారీ వర్షాల భయంతో ఫ్లై ఓవర్లపై కార్లు పార్క్ చేస్తున్న ప్రజలు
Heavy Rains in Chennai: చెన్నై ప్రజలు భారీ వర్షం అంటే చాలు భయపడిపోతున్నారు. 2015 భారీ వర్షాలు గుర్తొస్తున్నాయి. అందుకే వాహనాలు రక్షించుకునేందుకు కొత్త పద్ధతులు అనుసరిస్తున్నారు. ఈ దృశ్యం చూస్తే ఇదెక్కడి చోద్యంరా బాబూ అనుకుంటారు. కానీ నిజం ఇదే మరి..
Heavy Rains in Chennai: చెన్నై నగరవాసులకు 2015 భారీ వర్షాలు ఇంకా పీడకలగానే మిగిలుంది. ఆ వరదల్లో వందలాది కార్లు, ద్విచక్ర వాహనాలు కొట్టుకుపోయాయి. ఇప్పుడు మళ్లీ తుపాను ప్రభావం భారీ వర్షాలు పడుతుండటంతో వాహనాలు రక్షించుకునే పనిలో పడ్డారు. సరికొత్త పార్కింగ్ స్థలాల్ని ఎంచుకుని అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడుతోంది. క్రమంగా ఇది వాయుగుండంగా మారనుంది. ఈ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ సహా తమిళనాడులోని కొన్ని జిల్లాల్లో భారీ వర్షం కురుస్తోంది. నిన్నటి నుంచి చెన్నైలోని కోయంబేడు సహా నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదవుతోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో చాలా ప్రాంతాలు జలమయమయ్యాయి. అటు తిరువల్లూర్ నగరంలో కూడా కొన్ని ప్రాంతాలు ముంపుకు గురయ్యాయి. భారీ వర్షాల కారణంగా ఇప్పటికే చెన్నై చెంగల్పటచ్టు, కాంచీపురం, తిరువళ్లూరు జిల్లాల్లో స్కూల్స్, కళాశాలలకు సెలవు ఇచ్చేశారు. ఐటీ సిబ్బందికి వర్క్ ఫ్రం కేటాయించాలని అధికారులు సూచనలు జారీ చేశారు. రానున్న 3 రోజుల్లో ఇదే స్థాయిలో భారీ వర్షాలుంటాయని తెలుస్తోంది. ముఖ్యంగా ఈ నెల 17 నాటికి వాయగుండం తుపానుగా బలపడి చెన్నై-నెల్లూరు మధ్యలో తీరం దాటే పరిస్థితి ఉండటంతో మరింతగా భారీ వర్షాలు పడనున్నాయి.
చెన్నై నగరంతో పాటు శివారు జిల్లాల్లోని ప్రధాన ప్రాంతాల్ని అధికారులు, మంత్రులు పర్యవేక్షిస్తున్నారు. చెన్నై సహా ఇతర ప్రాంతాల్లో 40 సెంటీమీటర్ల వర్షం కురుస్తుందనే అంచనాలు ప్రజల్ని భయపెడుతున్నాయి. 2015 వరదల భయం వెంటాడకుండా ప్రజలు అప్రమత్తమవుతున్నారు. ముంపు నుంచి ఇళ్లను ఎలాగూ రక్షించుకోలేరు...కనీసం వాహనాలు రక్షించుకునేందుకు కొత్త పద్ధతులు పాటిస్తున్నారు./p>
పార్కింగ్ స్థలంగా మారిన ఫ్లై ఓవర్
అందుకే ఇలా ఫ్లై ఓవర్లపై కార్లు పార్క్ చేస్తున్నారు. ఈ ఫ్రై ఓవర్ చెన్నై నగరంలోనిది. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు తమ కార్లు వరదల్లో కొట్టుకుపోకుండా ఇలా తీసుకొచ్చి ఫ్లై ఓవర్‌పై ఓ పక్కకు పార్క్ చేసి వెళ్లిపోతున్నారు. ఇది చూసిన ఇతరులు కూడా తమ తమ ప్రాంతాల్లో ఉన్న ఫ్లై ఓవర్లపైకి కార్లు ఎక్కిస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.