Chennai Rains:  అకాల వర్షాలు ప్రజలను ముప్పతిప్పలు పెడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే పశ్చిమ కోస్తా ఆంధ్ర, రాయలసీమలోని కొన్ని జిల్లాలు జలమయం అయ్యాయి. ఆంధ్ర తో పాటు అటు తమిళనాడులో కూడా వరదల కారణంగా కొన్ని ప్రాంతాలు జలమయం అవడం, అక్కడి ప్రజలను మరింత అయోమయానికి గురిచేస్తోంది. భారీ వర్షాలు వరదల కారణంగా చెన్నై నగరం నీట మునిగింది. దీంతో రెడ్ అలర్ట్ విధించింది ప్రభుత్వం.. ముఖ్యంగా వర్షాలు తగ్గేవరకు రెడ్ అలర్ట్ కొనసాగుతుందని ప్రభుత్వం వెల్లడించింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


చెన్నై పరిసర ప్రాంతాలలో రెండు రోజులుగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి.భారీ వర్షాలు పడతాయని మొదట ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన ప్రభుత్వం , ఇప్పుడు వర్షాలు ఎక్కువ కావడంతో వాతావరణ శాఖ చెన్నైవ్యాప్తంగా రెడ్ అలర్ట్ జారీ చేసింది. అంతేకాదు పలుచోట్ల 10 సెంటీమీటర్ల పైన వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. 


గత రెండు రోజులుగా ఎడతెరపని వర్షాలతో నగరం అతలాకుతలమవుతోంది.. 300 ప్రాంతాలు దాదాపుగా నీటి మునిగిపోయాయి . పలు సబ్వే లలో మూడు అడుగుల మేర నీరు నిలిచిపోయింది. మంగళవారం చెన్నై తో పాటు సమీప నగరాలైన తిరువళ్ళూరు , కాంచీపురం, చెంగల్పట్టు జిల్లాలలో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ జిల్లాలలో బుధవారం కూడా రెడ్ అలర్ట్ జారీ కొనసాగుతోంది. కొన్నిచోట్ల వరదల్లో తమ కార్లు కొట్టుకుపోతాయని కొంతమంది సమీప ఫ్లైఓవర్లలో కార్లను పార్క్ చేసిన ఘటనలు కూడా మనం చూడవచ్చు. 


దీనికి తోడు చెన్నైలోని పోయిస్ గార్డెన్ లో ఉన్న సూపర్ స్టార్ రజినీకాంత్ ఇల్లు కూడా జలమయం అయిపోయింది.. ఆయన ఇంటిలోకి వరద నీరు వచ్చి చేరింది ..ప్రస్తుతం ఆ ఇంట్లో రజనీకాంత్ కుటుంబ సభ్యులు లేనట్లు తెలుస్తోంది. 


ఇకపోతే అకాల వర్షాలు, నీట మునిగిన ప్రాంతాలు పలు ఇబ్బందుల కారణంగా ఉద్యోగులకు సెలవులు ప్రకటించకుండా వర్క్ ఫ్రం హోం మూడు రోజులపాటు చేసుకోవచ్చని తెలిపింది ప్రభుత్వం. దీనికి తోడు  స్కూల్లకు, కాలేజీలకు కూడా సెలవు ప్రకటించారు.


ఇదీ చదవండి: Pawan Kalyan Second Daughter: పవన్ కళ్యాణ్ చిన్న కూతురును చూశారా.. ఎంత క్యూట్ గా ఉందో..!


ఇదీ చదవండి: Devara Villain Saif: దేవర విలన్ బైరాకు వైయస్ఆర్ ఫ్యామిలీకి ఉన్న ఈ రిలేషన్ తెలుసా..


 



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter