ఎస్‌బీఐ విలీనం చేసుకున్న బ్యాంకుల ఖాతాదారులకు చెందిన పాత చెక్‌బుక్‌లు, ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్‌లు ఇక చెల్లవు . దీనికి డిసెంబర్31 వరకు ఎస్‌బీఐ గడువు విధించింది. ఈ లోపు పాత చెక్ బుక్ మార్చుకోవాలని ఎస్‌బీఐ ఆయా ఖాతాదారులకు  సూచించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గతంలో పాత చెక్‌బుక్‌లను మార్చుకోవడానికి  2017 సెప్టెంబర్‌ 30న డెడ్‌లైన్‌గా గడువు విధించింది. అనంతరం ఆ గడువును డిసెంబర్‌ 31 వరకు పొడిగించిన సంగతి తెలిసిందే. గడువు దగ్గర పడుతున్న క్రమంలో ఎస్‌బీఐ  మరోసారి తన కస్టమర్లకు ఈ సూచన చేస్తోంది.


చెక్‌బుక్ లను మార్చుకోండిలా..
కొత్త చెక్‌బుక్‌ పొందడానికి బ్యాంకు శాఖనైనా సందర్శించవచ్చని లేదా ఎటీఎం, ఎస్‌బీఐ మొబైల్‌ యాప్‌ ద్వారానైనా దీన్ని పొందవచ్చని పేర్కొంది. ఎస్‌బీఐ కూడా మేజర్‌ సిటీల్లో ఉన్న బ్రాంచ్ పేర్లను, బ్రాంచ్ కోడ్‌లను, ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్‌లను  మారుస్తోంది. 


IFSC కోడ్స్ లో మార్పు..
తెలుగు రాష్ట్రాల రాజధానులు హైదరాబాద్, అమరావతి సహా దేశ రాజధాని ఢిల్లీతో సహా ముంబై, బెంగళూరు, చెన్నై,  కోల్‌కతా, పాట్న, అహ్మదాబాద్‌, భోపాల్‌,  చంఢీగర్‌, జైపూర్‌, తిరువనంతపురం, లక్నో వంటి నగరాల్లో ఎస్‌బీఐ బ్రాంచు  పేర్లను, బ్రాంచు కోడ్‌లను, ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్‌లను మార్చేసింది.


విలీనమైన బ్యాంకుల జాబితా..
ఈ ఏడాది ఆరంభంలో స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ హైదరాబాద్‌, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ పాటియాలా, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ బికనేర్‌ అండ్‌ జైపూర్‌, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ రాయ్‌పూర్‌, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ట్రావెన్‌కోర్‌ సహా భారతీయ మహిళా బ్యాంకులు ఎస్బీఐలో  విలీనమైన విషయం తెలిసిందే.