Man Kills His Grand Mother To Claim Rupees 1 Crore: ప్రస్తుతం సమాజంలో డబ్బే ప్రధానమైపోయింది. కొందరు డబ్బులు సంపాదించడం కోసం పగలనక రాత్రనక కష్టపడుతుంటారు. కొందరు చక్కగా చదువుకుని ఉద్యోగాలు చేస్తుంటే... మరికొందరు బిజినెస్ లు చేస్తూ కూడా రెండు చేతులా సంపాదిస్తున్నారు. మరికొందరు మాత్రం.. డబ్బుల కోసం, లగ్జరీ లైఫ్ ల కోసం అడ్డదారిలో డబ్బులు సంపాదించేందుకు చేయకూడదని పనులన్ని చేస్తున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Read More: Tillu Square: టిల్లు స్క్వేర్‌లో ఎవరు ఎక్స్‌పెక్ట్ చేయని క్యారెక్టర్.. ? ఫ్యాన్స్‌కు గూస్ బంప్స్ తెప్పించే న్యూస్..


మోసాలకు పాల్పడటం, అక్రమ దందాలు, వడ్డీల పేరిట మోసాలు, ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసాలకు పాల్పడుతున్నారు. కొన్నిచోట్ల మరీ దారుణంగా ప్రాపర్టీల కోసం అన్నదమ్ములు, ఒకే కుటుంబానికి చెందిన వారు కూడా గొడవలు పడి చంపుకొవడానికి కూడా వెనుకాడటం లేదు.


ఈ మధ్యకాలంలో అనేక ఇన్సురెన్స్ కంపెనీల వారు.. ఇప్పుడు చనిపోయిన వారికి ఇన్సూరెన్స్ రూపంలో భారీగా డబ్బులు అందేలా చూస్తున్నాయి. తమ వారు చనిపోయాక, ఆధారంగా ఉండేలా ఇన్సురెన్స్ వారు ఒక మంచి ఆలోచనతో ఇలా డబ్బులు ఇస్తున్నాయి. కానీ కొందరు కేటుగాళ్లు దీన్ని కూడా వక్రమార్గంలో డబ్బులు సంపాదించడానికి ఉపయోగిస్తున్నారు. ఇన్సురెన్సులు చేయించి, సదరు వ్యక్తులు చనిపోయినట్లు పేపర్లు క్రియేట్ చేస్తున్నారు. మరికొందరు ఇన్సురెన్స్ చేసుకున్న వారిని డబ్బుల కోసం చంపడానికి సైతం వెనుకాడటంలేదు. అచ్చం ఇలాంటి కోవకు చెందిన ఒక ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది.



పూర్తి వివరాలు..


ఛత్తీస్ గఢ్ లోని కాంకేర్ జిల్లాలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. ఒక వ్యక్తి కోటీశ్వరుడు కావాలన్న ఆశతో... తన అమ్మమ్మకు బీమాచేయించాడు. ఇంతవరకు బాగానే ఉన్నా.. ఆ మనవడి ఆలోచనలో మాత్రం కుట్ర దాగుందని పాపం.. ఆ పెద్దావిడ తెలుసుకోలేకపోయింది. రాణి పఠారియా అనే మహిళ పేరిట ఆమె మనవడు.. ఆకాశ్ కోటీరూపాయలు బీమా చేయించాడు. కొన్నినెలలుగా డబ్బులు కూడా కట్టేలా చూసుకున్నాడు.


ఈ క్రమంలోనే ఒక పాములు పట్టే వ్యక్తికి సుపారీ ఇచ్చాడు. అతని పాముతో పెద్దావిడకు కాటు వేయించాడు. ఆ తర్వాత ఏమి తెలియనట్లు అమాయకంగా.. పాము కాటులో తన బామ్మ చనిపొయిందని అందరిని నమ్మించాడు. ఆ తర్వాత అంతిమసంస్కారాలన్ని పూర్తిచేశాడు. కానీ.. యువకుడిపై గ్రామస్థులకు ఎక్కడో అనుమానంగా ఉండేది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు.


Read more: Bra and Breast Cancer: బ్రా ధరించడం వల్ల బ్రెస్ట్ కేన్సర్ వస్తుందా, నిజానిజాలేంటి


అప్పటికే యువకుడు.. పెద్దావిడ పేరిట చేయించిన బీమా కోటిని అందుకున్నాడు. జల్సాలు చేయడంలో మునిగిపోయాడు. పోలీసులు ఆకాశ్ ను అదుపులోనికి తీసుకుని తమదైన స్టైల్ లో విచారించగా అతగాడు తన తప్పును అంగీకరించాడు. ఆకాశ్ దగ్గర నుంచి పోలీసులు రూ. 10 లక్షలను రికవరీ చేశారు. అదే విధంగా రాణి పఠారియా కు చెందినర నగలను కూడా స్వాధీనం చేసుకున్నాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పోలీసులు మరింత లోతుగా విచారణ కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 


Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook