4 Pains Heart Attack Signs: హార్ట్ అటాక్ బారిన పడే ముందుగానే గుండెనొప్పిని అంచనా వేయాలి. కొన్ని లక్షణాలు సరిగ్గా కనిపించవు, కొంత మందిలో లక్షణాలే కనిపించవు. అయినా వారి గుండె జబ్బు బారిన పడుతూ ఉంటారు. దీంతో కొంతమంది ప్రాణాలు వదులుతారు. అయితే మీ శరీరంలో కనిపించని లక్షణాలు మీరు త్వరలో గుండెజబ్బుల బారిన పడుతున్నారని ముందే తెలుపుతాయంట.
ఈ లక్షణాలను మీరు ముందే పసిగడితే గుండె జబ్బులు నుంచి త్వరగా బయటపడవచ్చు. శరీరంలోని ఈ నాలుగు భాగాల్లో నొప్పి అనుభూతి చెందితే అది త్వరలో మీకు గుండె జబ్బు బారిన పడుతున్నారని మీకు అలారం. ఈ అనుభూతి చెందినప్పుడు మీరు వెంటనే సరైన వైద్యులను సంప్రదించాలి. దీంతో ప్రాణాలతో బయటపడతారు. గుండె జబ్బులు బారిన పడే అనుభూతి అంటే కేవలం ఛాతి నొప్పి మాత్రమే కాదు మరి కొన్ని మన శరీర భాగాల్లో ముందుగానే నొప్పి అనుభూతి కలుగుతుంది. దీనివల్ల మీరు గుండె జబ్బు బారిన పడుతున్నారని ముందుగానే అంచనా వేయవచ్చు.
పొత్తికడుపు నొప్పి..
గుండె జబ్బుల బారిన పడే ముందు కొంత మందికి పొత్తికడుపులో నొప్పిగా తరచూ అనుభవిస్తారు. అంటే దీని అర్థం మీరు త్వరలో గుండెజబ్బుల బారిన పడుతున్నారని అర్థం ఇది ప్రాణాంతకం కావచ్చు. ఈ అనుభూతి తరచూ వస్తే వెంటనే వైద్యులను సంప్రదించి సరైన టెస్టులు నిర్వహించుకోవాలి.
ఎడమ చేయి నొప్పి..
కొంత మందిలో కుడి లేదా ఎడమ లేకపోతే రెండు చేతుల్లో నొప్పి అనుభూతి కలుగుతుంది. ఇది ఏ పని చేయకుండా సడన్గా నొప్పి ఉంటుంది. కొంత మందికి ఎడమ వైపు ఛాతిలో నొప్పి కలుగుతుంది. ఇది కూడా గుండె జబ్బులో లక్షణం త్వరగా త్వరలో హార్ట్ ఎటాక్ బారిన పడుతున్నారని ఇదొక సైన్. ఈ లక్షణం కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి.
ఇదీ చదవండి: బరువు తగ్గాలంటే ఈ 5 అధిక ప్రోటీన్ పండ్లు తింటూ ఈజీగా వెయిట్ తగ్గుతారు తెలుసా?
ఛాతి నొప్పి..
ఇది ఎక్కువ శాతం మందిలో కనిపించే నొప్పి రక్తపోటు తీవ్రంగా పెరిగిపోవడం వల్ల కూడా చాతినొప్పి అయితే కొంతమందిలో గ్యాస్టిక్ సమస్య వల్ల కూడా నొప్పి వస్తుంది. ఏదేమైనా ఇలాంటి ఛాతి నొప్పి అనుభూతి చెందుతూ వెంటనే వైద్యులను సంప్రదించాలి. ఈ నొప్పి మాత్రమే కాదు కొంత మందిలో గొంతు నొప్పి దవడ నొప్పులు ఇవన్నీ కూడా త్వరలో మీరు హార్ట్ ఎటాక్ బారిన పడుతున్నారని తెలిపే సంకేతం. వెంటనే తెలుసుకొని వైద్యులను సంప్రదించాలి. అయితే కొంత మందిలో ఈ లక్షణాలు ఏవి కనిపించవు అయినా కానీ వీళ్లు గుండె జబ్బుల పారిన పడతారు. ముఖ్యంగా డయాబెటిస్ తో బాధపడేవారు గుండెజబ్బులతో బాధపడే అవకాశం ఎక్కువ.
ఇదీ చదవండి: గుండె ఆరోగ్యానికి నాలుగు.. ఇక మీ హృదయం జీవితాంతం ఆరోగ్యం..!
అయితే ఒక్కరికి ఒక్క విధంగా లక్షణం కనిపిస్తుంది. కొంతమందిలో అసలు లక్షణాలే కనిపించకుండా సడన్గా వస్తుంది అధిక స్ట్రెస్ యాంగ్జైటీ పెట్టుకోవడం వల్ల కూడా గుండె జబ్బులు వస్తాయి. దీనికి మంచి టెస్టులు వైద్యులు నిర్వహిస్తారు. ఇందులో మీరు హార్ట్ ఎటాక్ కి సంబంధించిన సమస్యలు తెలుసుకోవచ్చు. ఇలా కార్డియాక్ అరెస్ట్ నుంచి ప్రాణాలతో బయటపడతారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.