బ్లాక్ మనీ వైట్‌గా మార్చేందుకే నోట్ల రద్దు
నోట్ల రద్దు నిర్ణయంపై కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి పి.చిందరబరం విమర్శలు సంధించారు. బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చేందుకు మోడీ సర్కార్ కుట్రలో భాగంగానే నోట్ల రద్దు నిర్ణయం జరిగిందని ట్విట్లర్ వేదికగా ఆరోపించారు. ఇందంతా పద్దతి ప్రకారం చేసిన ప్రచారం తప్పితే మరేమి లేదని చిందంబరం మోడీ సర్కార్ పై ధ్వజమెత్తారు. నోట్ల రద్దు నిర్ణయం తర్వాత వెనక్కి వచ్చిన నోట్ల గుణాంకాలను ఆర్బీఐ విడుదల చేసిన సందర్భంలో పి.చిందబరం స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాటాడుతూ అన్నీ వెనక్కి వస్తే మరి దేశంలోని నల్లధనం అంతా ఏమైపోయిందని చిదంబరం ప్రశ్నించారు.