Next CJI Of India: సుప్రీంకోర్టు 50వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ డి.వై. చంద్రచూడ్..!
Next CJI Of India: సుప్రీంకోర్టు 50వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ డి.వై. చంద్రచూడ్ నియమితులు కానున్నారు. తదుపరి సీజేగా ఆయన పేరును ప్రస్తుత సీజేఐ జస్టిస్ లలిత్ ప్రతిపాదించారు.
Next CJI Of India: సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ డి.వై. చంద్రచూడ్ (Justice DY Chandrachud) నియమితులు కానున్నారు. ఈ మేరకు ఆయన పేరును జస్టిస్ యు.యు. లలిత్ ప్రతిపాదించారు. మంగళవారం ఉదయం సుప్రీంకోర్టులో జరిగన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్రతిపాదనను జస్టిస్ లలిత్ (CJI UU Lalit) కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖకు పంపనున్నారు. అక్కడి నుంచి ఆ లేఖను ప్రధాని పరిశీలనకు..చివరగా రాష్ట్రపతి వద్దకు చేరుకుంటుంది. ప్రెసిడెంట్ ఆమోద ముద్రతో ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపడతారు.
జస్టిస్ యుయు లలిత్ పదవీ నవంబర్ 8న పదవీ విరమణ చేయనున్నారు. తదుపరి సీజేఐ ఎవరో చెప్పాలని గత వారం లలిత్ ను కేంద్ర ప్రభుత్వం కోరింది. ఈ నేపథ్యంలో ఆయన చంద్రచూడ్ పేరును సిపార్సు చేయనున్నారు. సాధారణంగా ఈ పదవికి సీనియర్ న్యాయమూర్తి పేరును సిఫార్సు చేయడం సంప్రదాయం. జస్టిస్ ఎన్వీ రమణ తర్వాత ఆగస్టులో బాధ్యతలు స్వీకరించిన లలిత్... 74 రోజుల మాత్రమే పదవిలో ఉండనున్నారు. జస్టిస్ యుయు లలిత్ పదవీ విరమణ చేసిన తర్వాత సుప్రీంకోర్టు 50వ ప్రధాన న్యాయమూర్తిగా చంద్రచూడ్ బాధ్యతలు చేపడతారు.
నవంబరు 9న జస్టిస్ చంద్రచూడ్ ప్రమాణస్వీకారం చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది. 2024 నవంబరు 10 వరకు ఆయన ఆ పదవిలో కొనసాగుతారు. డి.వై. చంద్రచూడ్ పూర్తి పేరు ధనుంజయ యశ్వంత్ చంద్రచూడ్. ఈయన 1959 నవంబరు 11న మహారాష్ట్రలో జన్మించారు. ఈయన తండ్రి యశ్వంత్ విష్ణు చంద్రచూడ్ దేశ చరిత్రలో అత్యధిక కాలం పనిచేసిన ప్రధాన న్యాయమూర్తిగా గుర్తింపు పొందారు. గోప్యతా హక్కు, శబరిమలలో మహిళల ప్రవేశం సహా అనే కీలక కేసుల్లో జస్టిస్ డీవై చంద్రచూడ్ తీర్పులు ఇచ్చారు.
Also Read: Mulayam Singh Yadav Dies: ములాయం సింగ్ యాదవ్ కన్నుమూత!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook