వాచ్‌మన్ వద్ద ఉండే కుక్క కూడా దొంగతో చేతులు కలిపింది : నవ్‌జ్యోత్ సింగ్ సిద్ధూ
రఫెల్ డీల్ వివాదంపై సిద్ధూ సంచలన వ్యాఖ్యలు
ఇటీవల దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన రఫెల్ డీల్‌పై మొదటి నుంచి తీవ్ర ఆరోపణలు చేస్తూ వస్తోన్న కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం జరుగుతున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల్లోనూ ఇదే అంశాన్ని లేవనెత్తి కేంద్రంపై విమర్శల దాడికి దిగుతోంది. రాజస్థాన్‌లో శనివారం జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మాజీ క్రికెటర్, ప్రస్తుత పంజాబ్ రాష్ట్ర మంత్రి నవ్‌జ్యోత్ సింగ్ సిద్ధూ సైతం ఇదే అంశాన్ని లేవనెత్తి కేంద్రంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. రూ.500 కోట్ల విలువ చేసే విమానం కోసం రూ.1600 కోట్లు వెచ్చించారని, మిగతా రూ.1100 కోట్లు ఎవరి జేబుల్లోకి వెళ్లాయని.. ఎవరి మేలు కోసం ఈ లోపాయకారి ఒప్పందాలు చేసుకున్నారని సిద్ధూ విమర్శించారు. ఇదే క్రమంలో వాచ్‌మేన్ వద్ద పనిచేసే కాపలా కుక్క కూడా దొంగోడితో కలిసిపోయిందని సిద్ధూ ఎద్దేవా చేశారు.