CHSL Notification 2022: కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ (CHSL) పోస్టుల భర్తీకి టైర్ 1 పరీక్షను నిర్వహించేందుకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) ఇటీవలే ప్రకటన జారీ చేసింది. SSC CHSL రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తుల ప్రక్రియ ఇప్పటికే ప్రారంభం కాగా.. దీనికి అప్లే చేయడం ఎలానో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ పోస్ట్ కు అప్లే చేయాలనుకునే అభ్యర్థులు SSC అధికారిక వెబ్‌సైట్ sscsr.gov.inలో దరఖాస్తు చేసుకోవాలి. కేంద్ర ప్రభుత్వానికి చెందిన అనేక కార్యాలయాల్లో ఖాళీగా ఉన్న లోయర్ డివిజనల్ క్లర్క్, జూనియర్ సెక్రటేరియన్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్లు వంటి వాటిని ఈ ఎగ్జామ్ ద్వారా భర్తీ చేయనున్నారు. 


ఎగ్జామ్ సిలబస్..


SSC CHSL ఎగ్జామ్ మూడు దశల్లో జరగనుంది. మొదటిది రాత ఎగ్జామ్ (టైర్ - 1), డిస్క్రిప్టివ్ ఎగ్జామ్, స్కిల్ టెస్ట్, టైపింగ్ టెస్టుల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. టైర్ - 1 పరీక్షలో కంప్యూటర్ లో అబ్జెక్టివ్ విధానం ఉంటుంది. అందులో ఉత్తీర్ణత అయిన వాళ్లు టైర్ - 2 లో డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ నిర్వహిస్తారు. వీటిలో కనీసం 33 శాతం మార్కులు సాధించాల్సి ఉంది. వీటి తర్వాత కంప్యూటర్ టెస్ట్ లేదా టైపింగ్ టెస్ట్ తో అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 


మార్కుల కేటాయింపు..


SSC CHSL టైర్ 1 పరీక్షలు 2022 మే 24 నుంచి 2022 జూన్ 10 వరకు జరగనున్నాయి. టైర్ - 1 ప్రశ్నాపత్రంలో ఇంగ్లీష్, జనరల్ ఇంటెలిజన్స్, ఆప్టిట్యూడ్, జనరల్ అవేర్ నెస్ వంటి వాటిపై 100 మార్కులతో (ఆబ్జెక్టివ్) ఎగ్జామ్ నిర్వహించనున్నారు. 


ఒక్కో ప్రశ్నకు 2 మార్కులను కేటాయిస్తారు. సరైన సమాధానికి 2 మార్కులు, తప్పు సమాధానికి 0.5 మార్కులు కోత విధిస్తారు. పైన పేర్కొన్న ప్రతి సబ్జెక్ట్ నుంచి 50 మార్కుల మేర ప్రశ్నలు ఉంటాయి. టైర్ - 1 ఎగ్జామ్ కు గంట పాటు సమయాన్ని కేటాయిస్తారు. 


అడ్మిట్ కార్డుల కోసం..


SSC CHSL కోసం అడ్మిట్ కార్డ్‌లు డౌన్ లోడ్ చేసుకోవాలంటే సంబంధిత ప్రాంతీయ వెబ్ సైట్లలో SSC NR, SSC SR, SSC CR, SSC WR, SSC ER, SSC MPR, SSC KKR, SSC NWR, SSC NER వంటి వాటిలో అందుబాటులో ఉంటాయి.  


ALso Read: Pan Masala Star: మన వాళ్లు పాన్ ఇండియా స్టార్స్ అంట.. బాలీవుడ్ స్టార్స్ పాన్‌మసాల స్టార్స్‌ అంట..!!


Also Read: India Covid Cases: మరోసారి పెరిగిన కరోనా కేసులు.. భయాందోళనలో ఢిల్లీ వాసులు!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.