India Covid Cases: భారతదేశంలో కరోనా ఫోర్త్ వేవ్ అతి త్వరలోనే రానుందా? అంటే అవుననే అంటున్నాయి వైద్యారోగ్య శాఖ వర్గాలు. ఇప్పటికే ఢిల్లీ, కేరళ రాష్ట్రాల్లో కరోనా కేసులు నానాటికి పెరుగుతుండగా.. ప్రజలతో పాటు అధికారుల్లోనూ భయాందోళనలు నెలకొన్నాయి. అయితే గడిచిన 24 గంటల్లో 2,451 మంది కరోనా బారిన పడగా.. మరో 54 మంది కొవిడ్ వల్ల మరణించారు. ఇదే విషయాన్ని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలియజేసింది.
వీటితో దేశంలో మొత్తంగా కొవిడ్ కేసుల సంఖ్య 4,30,52,000కు చేరింది. రోజువారీ కొవిడ్ పాజిటివిటీ రేటు కూడా 0.5 శాతం మేర పెరిగింది. ఈ క్రమంలో దేశంలో 14,241 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నట్లు ప్రకటించింది. కరోనా నుంచి 1.589 మంది విముక్తి పొందినట్లు స్పష్టం చేసింది.
India reports 2,451 new COVID19 cases today; Active caseload at 14,241 pic.twitter.com/ikQuotdiCT
— ANI (@ANI) April 22, 2022
మరోవైపు ప్రపంచ దేశాలను కూడా కరోనా కలవరానికి గురిచేస్తుంది. వరల్డ్ వైడ్ గా గడిచిన 24 గంటల్లో 8 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదవ్వడం గమనార్హం. అయితే కొవిడ్ మహమ్మారి ధాటికి మరో 3,289 మంది మరణించారు. జర్మనీ, ఫ్రాన్స్, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా, ఇటలీ వంటి దేశాల్లో మరోమారు కరోనా కోరలు చాస్తుంది.
Also Read: India Covid Cases: మరోసారి పెరిగిన కరోనా కేసులు.. ఫోర్త్ వేవ్ కు సంకేతమా?
ALso Read: Covid Cases In India: దేశంలో కొవిడ్ డేంజర్ బెల్స్.. ఢిల్లీలో భయపెడుతున్న పాజిటివిటీ రేటు..!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.