పౌరసత్వ సవరణ చట్టం: అపోహలు- నిజాలు
పౌరసత్వ సవరణ చట్టం.. CAA-2019పై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీ సహా పలు రాష్ట్రాల్లో ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి. ఈ క్రమంలో పౌరసత్వ సవరణ చట్టం అసలు ఉద్దేశ్యమేంటి..? ఆందోళనలు ఎందుకు జరుగుతున్నాయి..? అపోహలు.. నిజానిజాలేంటి..? ఇప్పుడు తెలుసుకుందాం.
పౌరసత్వ సవరణ చట్టం.. CAA-2019పై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీ సహా పలు రాష్ట్రాల్లో ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి. ఈ క్రమంలో పౌరసత్వ సవరణ చట్టం అసలు ఉద్దేశ్యమేంటి..? ఆందోళనలు ఎందుకు జరుగుతున్నాయి..? అపోహలు.. నిజానిజాలేంటి..?
పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఈశాన్య రాష్ట్రాలతోపాటు పశ్చిమ బెంగాల్ లో నిరసలు ఆగడం లేదు. రోజురోజుకు ఆందోళనలు ఉద్ధృతమవుతున్నట్లుగానే పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటి వరకు ఈ ఆందోళనల్లో ముగ్గురు మృతి చెందారు. పలు రాష్ట్రాల్లో ప్రభుత్వ ఆస్తులు ధ్వంసమయ్యాయి. కేరళ, పశ్చిమ బెంగాల్ లాంటి రాష్ట్రాల్లో ఏకంగా ముఖ్యమంత్రులే ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొంటున్న పరిస్థితి ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ పౌరసత్వ సవరణ చట్టాన్ని , జాతీయ పౌరసత్వ జాబితా (NRC) ని పశ్చిమ బెంగాల్ లో అమలు కానిచ్చేది లేదంటూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పష్టం చేశారు.
పౌరసత్వ సవరణ చట్టం ఉద్దేశ్యమేంటి..?
పాకిస్తాన్, ఆప్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి భారత దేశానికి వలస వచ్చిన హిందువులు, సిక్కులు, జైనులు, పార్శీలు, బౌద్ద మతస్తులు, క్రైస్తవులకు భారత పౌరసత్వం ఇవ్వడమే పౌరసత్వ సవరణ చట్టం ఉద్దేశ్యం. 2014 డిసెంబర్ 31 కంటే ముందు వచ్చిన వారికి పౌరసత్వాన్ని కల్పిస్తారు. ఐతే దీనిపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. అసలు ఉద్దేశ్యం కంటే అపోహలే ఆందోళనకు కారణంగా కనిపిస్తోంది. అపోహలు వాటి వెనుక ఉన్న నిజాలేంటో ఇప్పుడు చూద్దాం.
1.అపోహ: పౌరసత్వ సవరణ చట్టం, జాతీయ పౌరసత్వ జాబితా వల్ల ముస్లింలకు నష్టం.
నిజం: భారత దేశంలో ఏ మతానికి చెందిన పౌరుడైనా పౌరసత్వ సవరణ చట్టం, జాతీయ పౌరసత్వ జాబితా గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
2. అపోహ: జాతీయ పౌరసత్వ జాబితాలో మతం ఆధారంగా పేరు తీసేస్తారు.
నిజం: లేదు. జాతీయ పౌరసత్వ జాబితాకు మతానికి సంబంధం లేదు. మత ప్రాతిపాదికన జాబితాలో నుంచి తీసి వేయరు.
3. అపోహ: పౌరసత్వాన్ని ఎలా నిర్ధారిస్తారు. అది ప్రభుత్వం చేతుల్లోనే ఉంటుంది.
నిజం: 2009 పౌరసత్వ చట్టం ఆధారంగా పౌరసత్వాన్ని నిర్ధారిస్తారు. భారత పౌరుడిగా నిర్ధారించుకునేందుకు 5 మార్గాలు అందుబాటులో ఉన్నాయి.
a. పుట్టుకతో వచ్చిన పౌరసత్వం.
b. భారత సంతతి ద్వారా వచ్చిన పౌరసత్వం.
c. పౌరసత్వాన్ని రిజిస్ట్రేషన్ చేసుకోవడం
d. సహజంగానే పౌరసత్వం పొందడం
e. భూభాగాన్ని చేర్చడం ద్వారా లభించిన పౌరసత్వం
4. అపోహ: భారత పౌరసత్వాన్ని నిరూపించుకునేందుకు తల్లిదండ్రుల వివరాలు ఇవ్వాలి.
నిజం: పుట్టిన తేది, ప్రాంతం సరిపోతుంది. ఒకవేళ అవి అందుబాటులో లేకుంటే తల్లిదండ్రుల పుట్టుక వివరాలు ఇవ్వాలి. ఓటర్ గుర్తింపు కార్డు, పాస్ పోర్ట్, ఆధార్ , జనన ధృవీకరణ పత్రాన్ని ఆధారాలుగా స్వీకరిస్తారు.
5. అపోహ: 1971 కంటే ముందు వారసత్వాన్ని నిరూపించుకోవాలి.
నిజం: అవసరం లేదు. 1971 కంటే ముందు వారసత్వాన్ని నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. అది కేవలం అస్సాం NRCకి మాత్రమే .
6. అపోహ: కీలక పత్రాలు లేని నిరక్ష్యరాసుల పరిస్థితి అగమ్యగోచరం.
నిజం: సాక్ష్యుల ఆధారంగా అధికారులు విచారణ చేస్తారు. భారత పౌరులకు ఎలాంటి ఇబ్బంది కలిగించే అవకాశం లేదు.
7. అపోహ: లింగమార్పిడి చేసుకున్న వారిని, నాస్తికులను, ఆదివాసీలను, దళితులను , భూమి లేని వారిని NRC నుంచి తొలగిస్తారు.
నిజం: లేదు. NRC నుంచి ఇలాంటి వారిని తొలగించే అవకాశం లేదు.