జాతీయ స్థాయిలో దేశంలోని ప్రముఖ లా కాలేజీలలో ప్రవేశానికి గాను నిర్వహించే పరీక్ష క్లాట్ (కామన్ లా అడ్మిషన్ టెస్టు) ఫలితాలను గురువారం అధికారికంగా అధికారులు విడుదల చేశారు. నేషనల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ అడ్వాన్స్‌డ్‌ లీగల్‌ స్టడీస్ ఆధ్వర్యంలో విడుదల చేసిన ఈ ఫలితాలు జూన్ 6వ తేది వరకు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటాయి. మే 13వ తేదిన ఈ పరీక్షను నిర్వహించారు.


తొలుత ఈ పరీక్షల్లో అనేక సాంకేతిక తప్పిద్దాలు జరిగాయని.. క్లాట్ పరీక్షను మరల నిర్వహించాల్సిందేనని అనేకమంది ఫిర్యాదు చేశారు. అయితే సుప్రీంకోర్టు ఈ విషయానికి సంబంధించిన వ్యాజ్యాన్ని తిరస్కరించింది. ఈ సంవత్సరం క్లాట్ పరీక్షకు దాదాపు 54 వేలమంది హాజరయ్యారు. తాజాగా వెలువడిన క్లాట్ ఫలితాలను https://admissions.clat.ac.in వెబ్ సైట్ ద్వారా పొందవచ్చు.