CLAT 2021 Notification: లా యూనివర్సిటీలలో ప్రవేశాల కోసం కామన్ లా అడ్మిషన్ టెస్ట్ (క్లాట్ 2021) నిర్వహించనున్నారు. ఈ మేరకు క్లాట్ 2021 నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో ఉత్తీర్ణులైన అభ్యర్థులు దేశ వ్యాప్తంగా ఉన్న 21 నేషనల్ లా యూనిర్సిటీలలోని అండర్ గ్రాడ్యుయేట్, పోస్టు గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్‌లలో ప్రవేశాలు పొందుతారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


జాతీయ న్యాయ విశ్వవిద్యాలయాల కన్సార్టియం క్లాట్ 2021 నోటిఫికేషన్ ఇటీవల విడుదల చేసింది. మే 9, 2021న ఆఫ్‌లైన్ విధానంలో ఈ ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహించనున్నారు. COVID-19 నిబంధనలు పాటిస్తూ పరీక్ష నిర్వహించనున్నారు.
Also Read: AP Jobs 2020: నిరుద్యోగులకు వైఎస్ జగన్ సర్కార్ శుభవార్త!



అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రాం వారికి 5 ఏళ్ల ఇంటిగ్రేటెడ్ లా డిగ్రీ
కనీసం 45 శాతం మార్కులతో ఇంటర్మీడియట్ లేక తత్సమాన పరీక్షలలో ఉత్తీర్ణులయిన వారు అర్హులు. వచ్చే ఏడాది మార్చి, ఏప్రిల్ సమయానికి ఇంటర్ పూర్తి అయి ఉండాలి.


పోస్టు గ్రాడ్యుయేట్ ప్రోగ్రాం. వీరికి ఏడాదిపాటు ఎల్ఎల్ఎం డిగ్రీ
క‌నీసం 50 శాతం మార్కుల‌తో ఎల్ఎల్‌బీ డిగ్రీ, లేక త‌త్సమాన ప‌రీక్షలో ఉత్తీర్ణత‌ సాధించిన వారు అర్హులు. ఏప్రిల్‌/ మే 2021లో ఎల్ఎల్‌బీ పూర్తి కావాల్సి ఉంటుంది. 


Also Read: Bank Jobs 2020: రాత ప‌రీక్ష లేకుండానే బ్యాంక్ జాబ్స్.. నోటిఫికేషన్ వచ్చేసింది



ముఖ్యమైన తేదీలు
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్
పరీక్ష : ఆఫ్‌లైన్‌లో
దరఖాస్తులు ప్రారంభం: జనవరి 1, 2021 
చివరి తేదీ: మార్చి 31, 2021
దరఖాస్తు ఫీజు: రూ.4,000 (ఎస్సీ / ఎస్టీ అభ్యర్థులకు రూ.3,500)
పరీక్ష తేదీ: మే 9, 2021 మధ్యాహ్నం 3 నుంచి 5 గంటల వరకు


అధికారిక వెబ్‌సైట్ 


Also Read: Hyderabad Jobs: హైదరాబాద్‌ ఎంఎస్ఎంఈలో జాబ్స్.. అప్లై చేసుకున్నారా!