Eknath Shinde: ఇది ట్రైలర్ మాత్రమే.. ఎన్నికల ఫలితాల వేళ కాక రేపుతున్న ఏక్ నాథ్ షిండే వ్యాఖ్యలు.. వీడియో ఇదే..
Maharashtra assembly elections 2024: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో ప్రస్తుతం మహయుతి గెలుపు లాంఛనమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రస్తుతం సీఎం ఏక్ నాథ్ షిండే చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ గా మారాయి.
Eknatha shinde comments after mahayuthi victory in Maharashtra: దేశంలో మళ్లీ కమలం పార్టీ ప్రభంజనం కొనసాగుతుందని చెప్పుకొవచ్చు. తాజాగా.. విడుదలైన మహారాష్ట్ర ఎన్నికలలో సైతం కమలం దూసుకుపోతోంది. మరాఠా గడ్డ మీద బీజేపీ 90 శాతం స్ట్రెయిట్ రేటు సాధించిందని తెలుస్తొంది. ఇక దాదాపు.. మహయుతి విజయం ఖరారు అయిపోయినట్లు చెప్పుకొవచ్చు. ఈ క్రమంలో ప్రస్తుతం ఏక్ నాథ్ షిండే మహాయుతిని భారీ మెజార్టీతో గెలిపించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. గతంలో తాను.. మహా ప్రజల కోసం.. శివసేన నుంచి బయటకు వచ్చినట్లు చెప్పారు. తమకు అప్పట్లో బీజేపీ సహాకారం అందించిందని అన్నారు.
అంతేకాకుండా.. రాబోయే రోజుల్లో కూడా మహారాష్ట్ర డెవలప్ మెంట్ కోసం కలిసి కట్టుగా ముందుకు వెళ్తామన్నారు. అంతే కాకుండా.. ఇది ట్రయిలర్ మాత్రమే, ఫిల్మ్ ఇంకా రావాల్సి ఉందని సీఎం నవ్వుతూ వ్యాఖ్యానించారు.మరోవైపు.. ఎన్డీయే కూటమి పనితీరుకు ఈ ఫలితాలు ఒక నిదర్శనమన్నారు. భారీ విజయం అందించిన మహారాష్ట్ర ప్రజలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నట్లు తెలిపారు. అయితే.. సీట్లు ఎవరికి ఎక్కువగా వస్తే.. వారు సీఎం పదవీ అధిష్టిరా.. అంటూ మీడియా వాళ్లు ప్రశ్నించారు.
ఈ క్రమంలో అలాంటిది లేదని.. తాము ఎన్నికలలో ఎలా కలిసి వెళ్లామో.. అదే విధంగా కూర్చుని మాట్లాడుకుని సీఎం పదవీ తదపరి నిర్ణయాల్ని సమిష్టిగా తీసుకొంటామన్నారు. అదే విధంగా.. అంతిమ ఫలితాలు వచ్చాక తాము నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు.
Read more: Pawan Kalyan Maharastra:మహారాష్ట్రలో పవన్ కళ్యాణ్ హవా..
మరొవైపు అపోసిషన్ పార్టీలు తమపై ఎన్ని ఆరోపణలు చేసిన కూడా ప్రజలు మహాయుతిపై మొగ్గుచూపాయన్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం ఏక్ షిండే చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. ఇదిలా ఉండగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రచారం నిర్వహించిన మెజారిటీ ప్రాంతాల్లో మహాయుతి విక్టరీ సాధించినట్లు తెలుస్తొంది.ఈ విజయంతో కాషాయ పార్టీకీ మరింత జోష్ వచ్చిందని చెప్పుకొవచ్చు.
ఇదిలా ఉండగా.. మహారాష్ట్రలో 288 సీట్లకు గాను.. 200 కు పైగా స్థానాల్లో బీజేపీ ఆధిక్యంలో ఉంది. అయితే.. మరాఠా గడ్డపై దేవెంద్ర ఫడ్నవీస్ సీఎం పదవీని అధిష్టిస్తారని కూడా వార్తలు వస్తున్నాయి. మరోవైపు షిండే వర్గం మాత్రం.. సీఎం సీటును వదులుకొనేందుకు సిద్దంగా లేనట్లు తెలుస్తొంది. ఈ క్రమంలో ప్రస్తుతం మహారాజకీయాలు మాత్రం రసవత్తరంగా మారాయని చెప్పుకొవచ్చు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebook, Twitter