గోవా: పనాజీ  అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో గోవా సీఎం మరోహర్ పారికర్ ఘన విజయం సాధించారు. సోమవారం జరిగిన ఓట్ల లెక్కింపులో ఆది నుంచి ఆధిక్యం కనబర్చిన పారికర్ ..సమీప ప్రత్యర్ధి  గిరీశ్ రయ చోదంకర్ (కాంగ్రెస్) పై  4 వేల 803 ఓట్ల తేడాతో గెలుపొందారు.


గత గోవా అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి పూర్తికి మెజార్టీ రాకుండా హంగ్ ఏర్పడిన నేపథ్యంలో కేంద్ర రక్షణ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న మనోహర్ పారికర్..తిరిగి గోవా రాజకీయాల్లో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. పారికర్ సీఎంగా బాధ్యతలు చేపడితే తాము మద్దతిస్తామని చిన్నా చితక పార్టీలు స్పష్టం చేసిన నేపథ్యంలో బీజేపీ అధిష్టానం ఆయన్ను కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయించి గోవా సీఎంగా బాధ్యతలు అప్పగించింది. ఈ నేపథ్యంలో ఆయన పనాజీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపు పొందారు. ఎమ్మెల్యేగా గెలుపొందిన నేపథ్యంలో పారికర్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. త్వరలోనే తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయనున్నట్లు వెల్లడించారు. కాగా ఉప ఎన్నికల్లో  గెలుపొందిన నేపథ్యంలో ప్రధాని మోడీ, బీజేపీ చీఫ్ అమిత్ షా పారికర్ కు శుభాకాంక్షలు తెలిపారు.