Covid-19 positive: న్యూఢిల్లీ: దేశంలో కరోనావైరస్ కేసుల సంఖ్య నానాటికీ పెరుగుతూనే ఉంది. సెలబ్రిటీల నుంచి రాజకీయనేతలు, ప్రముఖులు సైతం కోవిడ్-19 బారిన పడుతున్నారు. ఇప్పటికే పలువురు కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సైతం కరోనా బారిన పడి కోలుకున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తాజాగా ఉత్తరాఖండ్‌ ( Uttarakhand ) సీఎం త్రివేంద్ర సింగ్‌ రావత్‌ (Trivendra singh rawat ) సైతం కరోనా బారినపడ్డారు. పరీక్ష చేయించుకోగా కరోనావైరస్ పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు శుక్రవారం ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు. ప్రస్తుతం తనకు కరోనా లక్షణాలేం లేవని, ఆరోగ్యంగానే ఉన్నానని పేర్కొన్నారు. వైద్యుల సలహా మేరకు హోం ఐసోలేషన్లో ఉన్నట్లు ఆయన తెలిపారు. ఇటీవల తనను కలిసిన వారంతా కరోనా పరీక్షలు చేయించుకొని జాగ్రత్తలు పాటించాలని సీఎం రావత్‌ కోరారు. Also read: Farmer protests: రైతులందరూ ఆ లేఖను చదవాలి: ప్రధాని మోదీ


ఇదిలాఉంటే.. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) చీఫ్ డాక్టర్ బలరాం భార్గవకు కూడా కరోనా ( Coronavirus ) పాజిటివ్‌గా నిర్థారణ అయింది. తాజాగా జరిపిన పరీక్షలో (Balram Bhargava) కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయినట్లు అధికారులు శుక్రవారం వెల్లడించారు. దీంతో ఆయన్ను ఢిల్లీ ఎయిమ్స్‌లోని (AIIMS) ట్రామా కేర్ సెంటర్‌లో చేర్పించి చికిత్స అందిస్తున్నట్లు ఐసీఎంఆర్ వర్గాలు వెల్లడించాయి. Also read: Parliament: శీతాకాల సమావేశాలు రద్దు


Also read: Shruti Haasan: శృతి హాసన్.. గ్లామరస్ ఫొటోలు వైరల్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook