Yogi Adityanath: యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో యోగి ఎక్కడి నుంచి పోటీ... ఇదీ ఆయన రియాక్షన్
వచ్చే ఏడాది జరగబోయే యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేస్తానా.. చేస్తే ఎక్కడి నుంచి చేస్తాను అన్నది పార్టీనే నిర్ణయిస్తుందని యోగి ఆదిత్యనాథ్ పేర్కొన్నారు.
cm yogi adityanath clarifies whether he contest up assembly elections: వచ్చే ఏడాది జరగబోయే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేయడంపై స్పందించారు ఆ రాష్ట్ర సీఎం యోగి ఆదిత్యనాథ్. బీజేపీ అధిష్ఠానం ఆదేశిస్తే అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేస్తానన్నారు.పార్టీ ఎక్కడినుంచి పోటీ చేయమని ఆదేశిస్తే అక్కడి నుంచి పోటీ చేస్తానని చెప్పారు.ఎవరు ఎక్కడినుంచి పోటీ చేయాలనేది పార్టీ పార్లమెంటరీ బోర్డు నిర్ణయిస్తుందన్నారు.
2017 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నింటినీ తమ ప్రభుత్వం నెరవేర్చిందని యోగి ఆదిత్యనాథ్ పేర్కొన్నారు.తన హయాంలో యూపీలో శాంతిభద్రతలు మెరుగయ్యాయని... దీపావళి సహా అన్ని పండగలు ప్రజలు ప్రశాంత వాతావరణంలో జరుపుకున్నారని చెప్పారు.ఈ ఐదేళ్లలో రాష్ట్రంలో 4.5లక్షల మంది యువతకు ఉద్యోగాలు కల్పించామన్నారు.రిక్రూట్‌మెంట్ ప్రక్రియ అత్యంత పారదర్శకంగా జరిగిందని... ఎవరూ వేలెత్తి చూపలేదని అన్నారు. తమ ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలన్నీ అర్హులైన ప్రతీ ఒక్కరికీ చేరుతున్నాయన్నారు.
Also Read: Edible Oil Price Reduced: దేశంలో భారీగా తగ్గనున్న వంటనూనె ధరలు.. లీటరుకు రూ.5 నుంచి రూ.20 తగ్గింపు
కొద్దినెలల క్రితం యూపీలో నాయకత్వ మార్పు జరగబోతుందనే ఊహాగానాలు విస్తృతంగా ప్రచారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే.కరోనా నియంత్రణలో ప్రభుత్వ వైఫల్యం,సొంత పార్టీ నేతల అసమ్మతి... వెరసి యోగి ఆదిత్యనాథ్‌ను అధిష్ఠానం పక్కకు తప్పించబోతుందన్న ప్రచారం తెర పైకి వచ్చింది. ప్రధాని మోదీ,సీఎం యోగి మధ్య చెడిందనే ఊహాగానాలు కూడా వినిపించాయి. అప్పట్లో యోగిని బీజేపీ అధిష్ఠానం ఢిల్లీకి పిలిపించి మాట్లాడటం కూడా ఇందుకు బలం చేకూర్చింది.అయితే ఈ ప్రచారమంతా ఊహాగానాలకే పరిమితమైంది. 2022లో జరగబోయే యూపీ అసెంబ్లీ ఎన్నికలను యోగి ఆదిత్యనాథ్ నాయకత్వంలోనే ఎదుర్కొంటామని ఆ పార్టీ స్పష్టం చేసింది.వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ తమదే విజయమన్న ధీమాలో ఆ పార్టీ ఉంది.
ప్రస్తుతం యోగి ఆదిత్యనాథ్ ఎమ్మెల్సీ హోదాలోనే సీఎం పదవిలో కొనసాగుతున్నారు.అంతకుముందు,వరుసగా ఐదుసార్లు గోరఖ్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి గెలుపొందారు.2017 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం తర్వాత ఆ పార్టీ అధిష్ఠానం అనూహ్యంగా ఆయన్ను సీఎం చేసింది. దీంతో ఎంపీ పదవికి రాజీనామా చేసి ఎమ్మెల్సీ హోదాలో సీఎం పదవిలో కొనసాగుతున్నారు.ఈ నేపథ్యంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనైనా యోగి పోటీ చేస్తారా లేక ఎమ్మెల్సీగానే కొనసాగుతారా అన్న చర్చ జరుగుతోంది. ఇదే విషయంపై తాజాగా స్పందించిన ఆయన అంతా అధిష్ఠానం నిర్ణయం ప్రకారమేనని తేల్చేశారు.
Also Read: Sierra Leone: సియారా లియోన్‌లో ఘోర దుర్ఘటన..ఆయిల్ ట్యాంకర్ పేలి 91 మంది మృతి!
ఇదిలా ఉంటే,పెట్రోల్,డీజిల్‌లపై ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ డ్యూటీని తగ్గించిన సంగతి తెలిసిందే.రెండు రోజుల క్రితం యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తమ రాష్ట్రంలో పెట్రోల్,డీజిల్‌లపై వ్యాట్‌ను రూ.12 మేర తగ్గించారు. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఇప్పటినుంచే జనాకర్షక నిర్ణయాలు తీసుకుంటున్నారనే వాదన వినిపిస్తోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook