Gujarat మాజీ సీఎం కన్నుమూత.. ప్రధాని మోదీ సంతాపం
గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మాధవ్‌సింగ్ సోలంకి (94) కన్నుమూశారు. గుజరాత్ గాంధీనగర్‌లోని తన నివాసంలో సోలంకి (Madhav Singh Solanki ) శనివారం ఉదయం తుదిశ్వాస విడిచారు.
Gujarat Ex CM Madhav Singh Solanki passes away | గాంధీనగర్: గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మాధవ్‌సింగ్ సోలంకి (94) కన్నుమూశారు. గుజరాత్ గాంధీనగర్‌లోని తన నివాసంలో సోలంకి (Madhav Singh Solanki ) శనివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. వృత్తి రీత్యా న్యాయవాది అయిన సోలంకి.. 1976లో కొంతకాలం ముఖ్యమంత్రిగా పని చేశారు. ఆ తర్వాత 1980లో గుజరాత్ (Gujarat) లో కేహెచ్‌ఏఎం (క్షత్రియా, హరిజన, ఆదివాసీ, ముస్లిం) ఫార్ములాతో మాధవ్‌సింగ్ సోలంకి అధికారంలోకి వచ్చారు. 1980 ఎన్నికలకు ముందు (Congress) సోలంకి కేహెచ్‌ఏఎం (KHM) కూటమిని ఏర్పాటు చేశారు.
తిరిగి 1981లో సీఎంగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లను ప్రవేశపెట్టారు. 1985లో రాజీనామా చేసినప్పటికీ తర్వాత జరిగిన ఎన్నికల్లో 182 అసెంబ్లీ స్థానాలకు గాను 149 గెలిచి తిరిగి అధికారం చేపట్టారు. మొత్తం మీద మాధవ్‌సింగ్ సోలంకి గుజరాత్‌కు నాలుగుసార్లు సీఎంగా సేవలందించారు. Also Read: Maharashtra: ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం.. పది మంది శిశువుల మృతి
గుజరాత్ మాజీ సీఎం మృతికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi), కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ (Rahul Gandh) సంతాపం వ్యక్తం చేశారు. దశాబ్దాలు పాటు గుజరాత్ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించి మాధవ్‌సింగ్ సోలంకి సమాజానికి ఎన్నో సేవలు చేశారని కొనియాడారు. ఈ సందర్భంగా తన కుమారుడు భారత్‌తో మాట్లాడి, సంతాపం తెలియజేసినట్లు ప్రధాని ట్వీట్ చేశారు.
Also Read: Covid-19 Vaccine: 11న సీఎంలతో ప్రధాని మోదీ భేటీ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook