Congress leader, MP Ex CM Motilal Vora passes away: న్యూఢిల్లీ: కాంగ్రెస్ కురువృద్ధుడు, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మోతీలాల్ ఓరా సోమవారం తుదిశ్వాస విడిచారు. 93 ఏళ్ల మోతీలాల్ ఓరా ఢిల్లీలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ (MP Ex CM Motilal Vora passes away) కన్నుమూశారు. మూత్రకోశ వ్యాధితో బాధపడుతున్న ఓరాను మూడు రోజుల క్రితం ఆయన కుటుంబసభ్యులు ఢిల్లీలోని ఫోర్టీస్ ఆసుపత్రిలో చేర్పించారు. ఈ క్రమంలో ఆయన శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు పడుతుండటంతో అప్పటినుంచి ఆయన్ను వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆదివారంతో 93వ వసంతంలోకి (Motilal Vora Birthday) అడుగుపెట్టిన ఓరా.. పుట్టినరోజు తెల్లారే తుదిశ్వాస విడిచారని కుటుంబసభ్యులు పేర్కొన్నారు. మోతీలాల్ ఓరా మృతి పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi), కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఆయన కుటుంబసభ్యులకు సంతాపం తెలియజేశారు. Also read: India Bans UK Flights: యూకే నుంచి వ‌చ్చే విమానాల‌పై నిషేధం


మోతీలాల్ ఓరా 1927 డిసెంబర్ 20న ప్రస్తుత రాజస్థాన్‌లోని నింబిజోదా (Nimbi Jodhan) లో జన్మించారు. రెండుసార్లు మధ్యప్రదేశ్ ( Madhya Pradesh ) ముఖ్యమంత్రిగా సేవలందించారు. ముందు సమాజ్‌వాదీ పార్టీలో తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన మోతీలాల్ ఓరా.. ఆ తర్వాత కాంగ్రెస్ ( Congress ) పార్టీలో చేరారు. ఆ తర్వాత రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదుగుతో ఎన్నో పదవులను చేపట్టారు. దీంతోపాటు మోతీలాల్ ఓరా కేంద్ర మంత్రిగా కూడా పలు శాఖల్లో బాధ్యతలు చేపట్టి పాలన పరమైన విషయాల్లో తనదైన ముద్ర వేసుకున్నారు. 


Also read: Amit Shah: సీఏఏపై కేంద్ర హోంమంత్రి కీలక వ్యాఖ్యలు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook