Rahul Night Club Video: రాహుల్ గాంధీ నైట్ క్లబ్ వీడియో లీక్... నేపాల్‌లో ఎంజాయ్ చేస్తున్న కాంగ్రెస్ అగ్ర నేత..?
Rahul Gandhi Night Club Video: కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ నైట్ క్లబ్ వీడియో సోషల్ మీడియాలో లీకైంది. నేపాల్ రాజధాని ఖాట్మండులోని ఓ నైట్ క్లబ్‌కి రాహుల్ వెళ్లినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Rahul Night Club Video: ఓవైపు కాంగ్రెస్ పార్టీలో ప్రశాంత్ కిశోర్ చేరికపై ఇరువురి మధ్య విస్తృతంగా సంప్రదింపులు జరుగుతున్న తరుణంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ కనిపించకుండా పోయిన సంగతి తెలిసిందే. రాహుల్ విదేశాలకు వెళ్లినట్లు కథనాలు వచ్చాయి. అయితే ఆయన ఎక్కడికి వెళ్లారనే దానిపై కచ్చితమైన సమాచారం లేదు. ఈ నేపథ్యంలో తాజాగా రాహుల్ గాంధీకి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. విదేశాల్లో నైట్ క్లబ్‌లో రాహుల్ ఎంజాయ్ చేస్తున్నట్లు ఆ వీడియో చూస్తే అర్థమవుతోంది.
బీజేపీ జాతీయ ఐటీ విభాగం చీఫ్ మాళవియా రాహుల్ వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేశారు. ట్వీట్‌లో రాహుల్‌కు చురకలంటించే వ్యాఖ్యలు చేశారు. రాహుల్ చాలా స్థిరత్వం కలిగిన వ్యక్తి అని... ఓవైపు సొంత పార్టీలో రచ్చ నడుస్తుంటే ఆయన మాత్రం నైట్ క్లబ్‌లో గడుపుతున్నారని పేర్కొన్నారు.
ఫేస్‌బుక్‌లోనూ రాహుల్ నైట్ క్లబ్ వీడియోలు ప్రత్యక్షమయ్యాయి. అందులో ఉన్న సమాచారం ప్రకారం రాహుల్ నేపాల్‌లోని ఖాట్మండు నైట్ క్లబ్‌లో గడుపుతుండగా ఆ వీడియో తీసినట్లు తెలుస్తోంది. అంతేకాదు, ఆ వీడియోలో రాహుల్ పక్కన ఉన్న మహిళ... నేపాల్‌కు చైనా బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న యాంకీనా? అని పలువురు నెటిజన్లు సందేహాలు వెలిబుచ్చడం గమనార్హం. రాహుల్ వీడియోపై నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయలు వ్యక్తమవుతున్నాయి.
కాంగ్రెస్ మద్దతుదారులు అమిత్ మాళవియా ట్వీట్‌కు కౌంటర్స్ ఇస్తున్నారు. గతంలో పుల్వామా దాడి జరిగిన సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ ఫోటోషూట్‌లో బిజీ బిజీగా గడిపారని... రాహుల్ నైట్ క్లబ్‌కి వెళ్తే తప్పేంటని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు బీజేపీ మద్దతుదారులు రాహుల్ తీరుపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఓవైపు కేంద్రమంత్రి స్మృతీ ఇరానీ వయనాడ్‌లో పర్యటిస్తూ అక్కడి సమస్యలు తెలుసుకుంటుంటే... అదే లోక్‌సభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న రాహుల్ విదేశాల్లో నైట్ క్లబ్స్‌లో గడపడమేంటని.. దీన్నిబట్టి రాహుల్‌కు రాజకీయాల పట్ల ఉన్న ఆసక్తి ఏపాటిదో అర్థమవుతోందని విమర్శలు సంధిస్తున్నారు.
స్నేహితురాలి పెళ్లి కోసమే రాహుల్ 'ఖాట్మండు' వెళ్లారా...?
రాహుల్ గాంధీ తన నేపాలీ స్నేహితురాలు 'సుమ్నిమా ఉదాస్' పెళ్లి కోసం సోమవారమే (మే 2) ఖాట్మండుకు విచ్చేసినట్లు స్థానిక మీడియా సంస్థ 'ఖాట్మండు పోస్ట్' ఒక కథనంలో పేర్కొంది. రాహుల్‌తో పాటు మరో ముగ్గురు ఖాట్మండుకు వచ్చారని... ఆ నలుగురు స్థానిక మారియట్ హోటల్లో బస చేశారని వెల్లడించింది. గతంలో నేపాల్‌కు మయన్మార్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించిన సుమ్నిమాఉదాస్ తండ్రి భీమా ఉదాస్ ఈ విషయాన్ని వెల్లడించినట్లు తెలిపింది. సుమ్నిమా ఉదాస్ గతంలో సీఎన్ఎన్ కరస్పాండెంట్‌గా పనిచేసినట్లు ఖాట్మండు పోస్టు కథనంలో పేర్కొన్నారు. నిమా మార్టిన్ షెర్పా అనే వ్యక్తితో సుమ్నిమా వివాహం మంగళవారం (మే 3) జరగనుంది. వెడ్డింగ్ రిసెప్షన్ మే 5న జరగనుంది.
జోధ్‌పూర్‌లో అల్లర్ల వేళ పార్టీ మూడ్‌లో రాహుల్.. : బీజేపీ విమర్శలు
రాహుల్ గాంధీ నైట్ క్లబ్ వీడియోపై బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా స్పందించారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న జోధ్‌పూర్‌లో అల్లర్లు జరుగుతుంటే... రాహుల్ మాత్రం నేపాల్‌లో పార్టీ మూడ్‌లో ఉన్నారని విమర్శించారు. గతంలో ముంబైపై 26/11 దాడుల సమయంలోనూ రాహుల్ ఇలాగే పార్టీ చేసుకున్నారని విమర్శించారు. 'ఓవైపు రాజస్తాన్ తగలబడుతుంటే రాహుల్ పార్టీ చేసుకుంటున్నారు. ఇండియాలో చాలా సమస్యలపై రాహుల్ ట్వీట్స్ చేస్తుంటారు. కానీ భారత ప్రజల కంటే ఆయన బార్స్‌కే ప్రధాన్యమిస్తారు. ఆయన పార్ట్ టైమ్ పొలిటిషీయన్ కూడా కాదు. పార్టీ టైమ్ పొలిటీషియన్.' అని షెహజాద్ రాహుల్‌పై విమర్శలు గుప్పించారు.
కాగా, రంజాన్ పండగ వేళ జోధ్‌పూర్‌లో రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. రంగంలోకి దిగిన పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు. ప్రస్తుతం అక్కడ ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు.
[[{"fid":"229913","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]
Also Read: Akshaya Tritiya 2022: అక్షయ తృతీయ నాడు బంగారం కొనుగోలుచేయడానికి బదులుగా.. ఈ పనులు చేస్తే మంచిది!
Also Read:This Week Tollywood Releases: ఈ వారం థియేటర్లలో సందడి చేయనున్న కొత్త సినిమాలివే...
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.