Punjab Elections: పంజాబ్​ కాంగ్రెస్​ ముఖ్యమంత్రి అభ్యర్థిపై అధిష్ఠానం క్లారిటీ ఇచ్చింది. ఇటీవల వచ్చిన ఊహాగానాలకు చెక్ పెడుతూ.. ప్రస్తుత సీఎం చరణ్​ జిత్​ సింగ్ చన్నీనే తమ సీఎం అభ్యర్థికగా ప్రకటించారు కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఎన్నికలు దగ్గర పడుతున్న నేఫథ్యంలో ఆదివారం పంజాబ్​లోని లుథియానాలో పర్యటించారు రాహుల్​ గాంధీ. ఇందులోనే సీఎం అభ్యర్థి ఎవరనే విషయంపైనా ప్రకటన చేశారు.


పంజాబ్​ ముఖ్య మంత్రి అభ్యర్థిని నిర్ణయించేందుకు ప్రజాభిప్రాయ సేకరణ జరిపిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాహుల్ గాంధీ వెల్లడించారు. పంజాబ్​ ప్రజల సూచన మేరకు.. బలహీన వర్గాల సమస్యలను అర్థం చేసుకునే.. కింది స్థాయి నుంచి వచ్చిన నేతను సీఎం అభ్యర్థిగా ఎంచుకున్నట్లు రాహుల్ గాంధీ పేర్కొన్నారు.


చన్నీ పేద కుటుంబం నుంచి వచ్చాడని. అతను పేదరికం కష్టాల గురించి తెలుసన్నారు రాహుల్​.


ఈ ప్రకటనపై చరణ్​జిత్ సింగ్ చన్నీ స్పందించారు. తాను సీఎం అభ్యర్థిగా ప్రకటించడంపై రాహుల్ గాంధీకి ధన్యవాదాలు తెలిపాడు. ఆయన (రాహుల్​ గాంధీ) వల్ల ఓ పేదవాడు సీఎం అయ్యాడని పేర్కొన్నారు.


తాను ఈ యుద్ధంలో (ఎన్నికల్లో) ఒక్కడినే పారాడలేనని.. తన వద్ద అంత డబ్బు, ధైర్యం లేదని పేర్కొన్నారు చన్నీ. పంజాబ్ ప్రజలు ఈ యుద్ధంలో పోరాడుతారని తెలిపారు.


Also read: India Covid-19 Update: దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు, పెరిగిన మరణాలు


Also read: Himachal Pradesh snow: మంచు కురిసే వేళలో.. హిమాచల్ అందాలు చూద్దామా!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook