Indore congress leaders brawl video : కాంగ్రెస్ నేతల ఘర్షణ.. ముష్టి యుద్ధం వీడియో వైరల్
గణతంత్ర దినోత్సవం వేడుకల్లో భాగంగా జాతీయ జండా ఎగరేసేందుకు పార్టీ కార్యాలయానికి చేరుకున్న ఇద్దరు కాంగ్రెస్ నేతలు.. అందరి ముందే ముష్టి యుద్ధానికి దిగిన ఘటన ఇది.
ఇండోర్ : గణతంత్ర దినోత్సవం వేడుకల్లో భాగంగా జాతీయ జండా ఎగరేసేందుకు పార్టీ కార్యాలయానికి చేరుకున్న ఇద్దరు కాంగ్రెస్ నేతలు.. అందరి ముందే ముష్టి యుద్ధానికి దిగిన ఘటన మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో చోటుచేసుకుంది. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలతో పార్టీ శ్రేణులు బిజీగా ఉండగానే.. దేవేంద్ర సింగ్ యాదవ్, చందు కుంజిర్ మధ్య చోటుచేసుకున్న స్వల్ప వివాదం వాగ్వీవాదానికి దారితీసింది. అంతిమంగా ఆ వివాదం కాస్తా ముదిరి ఒకరిపై మరొకరు చేయి చేసుకునే వరకు వెళ్లింది. దీంతో అక్కడే ఉన్న పోలీసులు పరిస్థితి మరింత చేయిదాటి పోకముందే మధ్యలో జోక్యం చేసుకుని ఆ ఇరువురినీ శాంతింపజేశారు.
ఇండోర్‌లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో చోటుచేసుకున్న ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మధ్యప్రదేశ్‌లో అధికారంలో ఉన్న పార్టీ కూడా కావడంతో.. దేవేంద్ర సింగ్ యాదవ్, చందు కుంజిర్ ఇద్దరూ పార్టీ ప్రతిష్టకు భంగం కలిగేలా వ్యవహరించారంటూ మధ్యప్రదేశ్ సీఎం కమల్ నాథ్ సైతం వారిపై ఆగ్రహం వ్యక్తంచేసినట్టు సమాచారం. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..